BJP Leader Threatens voters For Having Congress Flags On Houses ‘‘కాంగ్రెస్ మద్దతుదారులకు విద్యుత్, తాగునీరు నిలిపేయండీ’’

Deprive them of services says mp bjp leader for those having congress flags on houses

Prahlad Patel, BJP candidate, BJP Leader Threatens people, BJP Leader Threatens voters, BJP Leader Threatens congress supporters, Ratlam mayoral elections, MP BJP Leader, Deprive Them Of Services, Congress Supporters, Congress Flags, Congress Flags On Houses, power connection cut, water connection cut, Madhya Pradesh, social media, viral video

Prahlad Patel, the BJP candidate for the mayoral elections in Madhya Pradesh’s Ratlam, has landed in a controversy after one of his videos while campaigning went viral on social media. “Click pictures of all those houses which have Congress flags. Deprive them of all services,” Mr Patel is heard telling a crowd in what appeared to be campaign rally.

‘‘కాంగ్రెస్ మద్దతుదారులకు విద్యుత్, తాగునీరు నిలిపేయండీ’’: బీజేపి నేత

Posted: 07/11/2022 04:43 PM IST
Deprive them of services says mp bjp leader for those having congress flags on houses

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాపాలన సాగుతోందని, రమారమి రామరాజ్యంలో పాలన మాదిరిగా పాలన సాగుతోందని తమకు తాము కితాబిచ్చుకుని.. ప్రశంసలు కురిపించుకునే నేతలకు ఇప్పుడు షాక్ తగిలింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలపై మాత్రమే సామధానబేద దండోపాయాలను వినియోగించి.. తమ వైపు అకర్షించుకున్న కాషాయ పార్టీ ప్రజలపై కూడా అదే అస్త్రాన్ని సందించాలనుకుని అడ్డంగా బుకైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. బీజేపి నేతల బెదిరింపులు ఏకంగా సామాన్యుల వరకు రావడం అది కాస్తా వివాదాస్పందంగా మారింది.

ప్రతిపక్ష పార్టీ జెండాలు ఉన్న ఇళ్లకు విద్యుత్‌, తాగునీరు వంటి ప్రభుత్వ సేవలన్నీ నిలిపివేయాలని బీజేపీ మేయర్‌ అభ్యర్థి ఏకంగా అధికారులకు అదేశించడమే కాదు.. ప్రజల్లో నిలబడి మరీ బెదిరించాడు. రాజధాని భోపాల్‌కు సమీపంలో ఉన్న రత్లాం నగరంలో జరిగిన ఈ సంఘటనతో ఆయన ఒక్కసారిగా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఈనెల 13న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ మేయర్‌ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్‌కు, కాంగ్రెస్‌ అభ్యర్థి మయాంక్ జాట్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ శనివారం ప్రహ్లాద్‌ పటేల్‌కు మద్దతుగా అక్కడ రోడ్‌ షో నిర్వహించి ప్రసంగించారు.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారానికి జనం పెద్దగా హాజరుకాలేదు. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో అక్కడి ప్రజలు అన్ని స్థాయిల్లో మార్పు కోరుకుంటున్నారని అనడానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి మయాంక్ సభకు జనం పోటెత్తారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాగా, కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి మయాంక్‌ గట్టి పోటీ ఇవ్వడాన్ని బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌ పటేల్‌ సహించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక ప్రాంతంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ జెండాలున్న ఇళ్లను చూసి ఆయన ఆగ్రహం చెందారు.

దీంతో ‘కాంగ్రెస్ జెండాలు ఉన్న ఇళ్ల ఫొటోలు తీయండి. వారికి అన్ని ప్రజాసేవలు నిలిపివేయండి. మనకు 5-10 ఇళ్ల నుంచి ఓట్లు రాకపోయినా పర్వాలేదు. కానీ వారికి గుణపాఠం చెప్పాలి’ అని ప్రహ్లాద్పటేల్ మండిపడ్డారు. బహిరంగంగా ఆయన బెదిరించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. తన మాటలను వక్రీకరించిన వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని బీజేపీ మేయర్‌ అభ్యర్థి ప్రహ్లాద్‌ పటేల్‌ ఆరోపించారు. దర్యాప్తు కోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీని వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles