YS Vijayamma resigns as YSRCP Honourary President, వైఎస్సార్‌సీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. షర్మిలకు మద్దుతుగా..

Ys vijayamma resigns as ysrcp honourary president to support sharmila

YS Vijayamma, YSRCP Honourary President, Y.S. Jagan Mohan Reddy, Andhra Pradesh CM, YSRCP, YS Sharmila, YSRCP plenary, YSRTP, YS Rajashekar Reddy, YS Vivekananda Reddy, YS Sunita, YSRCP general secretary V. Vijaysai Reddy, Andhra Pradesh, Politics

YS Vijayamma resigned from the post of Honorary President of YSRCP. Vijayamma announced that she is stepping down from the post of Honorary President at the YCP Plenary. Vijayamma said that she will support Sharmila, who has formed a party in Telangana, as she is fighting alone. As a mother, she said that she will support both her children.

వైఎస్సార్‌సీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. షర్మిలకు మద్దుతుగా..

Posted: 07/08/2022 09:03 PM IST
Ys vijayamma resigns as ysrcp honourary president to support sharmila

వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ సమావేశాల్లో ప్రకటించారు. ఇప్పటికే తాను రాయని, తాను సంతకం చేయని ఓ రాజీనామా లేఖ ఇంటర్ నెట్ లో దర్శనమిస్తోందని.. అందులో వాడిని తీవ్ర అభ్యంతరకర బాషను తీవ్రంగా ఖండించిన ఆమె.. తాను వెఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన షర్మిలకు మద్దతుగానే ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇక్కడ ఈ పార్టీలో కొనసాగుతూ అక్కడ ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తే అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని, అది తనకు ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలోనే తాను వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు,

తెలంగాణ కోడలుగా.. వైఎస్సార్‌ కూతురిగా.. వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ టీపీ పెట్టిందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుందన్నారు. ఎల్లో మీడియాలో ఏదిబడితే అది రాస్తున్నారు. ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం దురదృష్టకరం. ఇద్దరి పిల్లలకు తల్లినే.. తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్‌. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు అని విజయమ్మ అన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీ కంటే కూడా.. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి.

ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో షర్మిలకు వేర్వేరు విధానాలు ఉంటాయని’’ విజయమ్మ అన్నారు. ‘‘వైఎస్‌ఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్నవారు జగన్, షర్మిల. నేను రాయని, చేయని సంతకంతో.. రాజీనామా లేఖ విడుదల చేశారు. ఇవి జుగుప్సకర రాతలు. ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసింది. నేను రాయని, నేను చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారు?. తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది, అందుకే నేను అక్కడ షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నానని’’.. ఇందుకోసమే తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు అమె ప్రకటించారు.

తన ఉనికి ఎవరికి వివాదస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం. ప్రజలకు తన ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతు తన ఇద్దరి బిడ్డలకు కావాలని అమె కోరారు. తల్లిగా జగన్‌కు ఎప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ‘‘నన్ను క్షమించమని వైఎస్ఆర్ అభిమానులను కోరుతున్నాను. రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదు. వైఎస్సార్‌ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరు’ అని  వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఇలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’’ అని విజయమ్మ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles