ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోంది. భారత ప్రభుత్వం జారీ చేసిన అదేశాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఆర్జి దాఖలు చేసింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్తర్వులు అందాయి. ప్రభుత్వ చర్యలపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులను తొలగించాలని కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి.
అయితే వీటిలో కొన్ని రిక్వెస్ట్‌లు సమంజసంగా లేవని ట్విట్టర్ తన పిటీషన్ లో పేర్కోంది. తమ భారత ఖాతాదారుల భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వ అదేశాలు భంగం కలిగించేలా ఉన్నాయని ట్విట్టర్ కేసు వేసింది. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధికారిక ఖాతాలు పెట్టిన పోస్టులను తొలగించాలని తమకు ఆదేశాలు వచ్చాయని, కానీ అలా చేయడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కేయడమేనని ఈ సోషల్ మీడియా సంస్థ వాదిస్తోంది. దేశ భద్రతకు, హింసను ప్రేరేపించే పోస్టులను తామ సిబ్బంది తొలగిస్తున్నారని ట్విట్టర్ సంస్థ పేర్కోంది.
కాగా, ఇతర పార్టీ నేతలు, పెట్టిన పోస్టులతో పాటు ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పెట్టిన పోస్టులను కూడా తొలిగించాలని భారత ప్రభుత్వం కోరుతోందని.. ఇది వారి అభిప్రాయాల భావవ్యక్తీకరణ హక్కుకు విఘాతం కల్పించమే కదా అని పేర్కోంది. అయితే కొత్త ఐటీ రూల్స్ ప్రకారం, దేశ భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల కంటెంట్ ప్రజలకు అందుబాటులో లేకుండా బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని భారత ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారని, ఇది అధికార దుర్వినియోగమని ట్విట్టర్ ఆరోపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more
Aug 06 | ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను... Read more
Aug 06 | మధుమేహం.. షుగర్.. ఎలా పిలిచినా ఒకసారి దాని బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క మందులే కాదు.. ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్... Read more