మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు రెబల్స్‌కు అల్టిమేటం జారీ చేశారాయన. మహా వికాస్ అఘాడి(కూటమి ప్రభుత్వం)ని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే.. ఇంటికి వెళ్లనివ్వబోమని, రోడ్డుపై అడ్డుకుంటామని ఓ కేంద్ర మంత్రి బెదిరించారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విధమైన వ్యాఖ్యలు నిజమే అయితే.. బయటకు చెప్పుకోవాలని అన్నారు.
ఇక మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఉండినా, ఊడినా.. శరద్‌పవార్ లాంటి నేత మీద ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదు అని సంజయ్ రౌత్ అన్నారు. శరద్ పవార్ లాంటి నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదన్న ఆయన కేంద్రమంత్రి నారాయణ రాణే చేసిన ఈ వ్యాఖ్యాలకు కేంద్రమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ మద్దతు కూడా ఉందా.? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ దానిని ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. పదవులు, అధికారంతో సంబంధం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు.
కాగా, తిరుగుబాటు సేన ఎమ్మెల్యేలను శరద్ పవార్ బెదిరించారని, ఎప్పటికైనా శివసేన ఎమ్మెల్యేలు ముంబైకి రావాల్సిందేనని, తమ ఇష్టపూర్వకంగా ఓటు వేయాల్సిందేనని అన్నారు. ఆయన బెదిరింపుల తరువాతే తాము ఆయనపై వ్యాక్యలు చేశామని రాణే చెప్పుకోచ్చారు. అటు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే గూటికి చేరడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా ఆ పార్టీ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాతి అడుగు ఏంటన్నదానిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నిరంతరం టచ్‌లో ఉన్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలంతా పరస్పరం టచ్‌లో ఉన్నాం. మా బలమేంటో పరీక్షలో నెగ్గి చూపిస్తాం. అవకాశాన్ని వదలుకోం.. గెలిచి తీరతాం. వాళ్లు ( రెబల్ ఎమ్మెల్యేలు) చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ముంబైకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇచ్చాం. ఇప్పుడు, ముంబైకి రావాలని వాళ్లను సవాలు చేస్తున్నాం. ఈ పోరాటంలో పశ్చాత్తప పడాల్సిన అవసరం లేదు. ఇంటా(అసెంబ్లీ).. బయటా(రోడ్లపై) గెలిచి తీరతాం. వాళ్లకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఇచ్చాం. కానీ, ఆలస్యమైంది. బలనిరూపణతోనే తేల్చుకోవాలని వాళ్లకు చాలెంజ్ చేస్తున్నా. మహా వికాస్ అగాడి ప్రభుత్వం మిగిలిన రెండున్నరేళ్లు కూడా పూర్తి చేసుకుని తీరుతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more