2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల కేసులో గతంలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని, ఈ కేసులో దాఖలైన నిరసన పిటీషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.
2021, డిసెంబర్ 8వ తేదీన ఈ కేసులో విచారణ పూర్తి అయ్యింది. అయితే సుప్రీం తన తీర్పును ఇవాళ వెలువరించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సిట్ తీర్పును 2017లో గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. మోదీతో పాటు ఇతర రాజకీయవేత్తలు, అధికారులపై 2006లో జాకియా జఫ్రీ కేసును నమోదు చేసింది. 2008లో అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more