తెలంగాణ ప్రజలతో ముడివేసుకున్న సహజసిద్ధమైన ప్రకృతి ప్రసాదినీ కల్లు. ఈ కల్లులో రెండు రకాలు అవే తాటి, ఈత. అయితే అత్యంత అరుదుగా కజ్జూర, కొబ్బరి, ఇలా పలు చెట్లకు కూడా కల్లును గీస్తారు. అయితే తెలంగాణలో మరీ ముఖ్యంగా పల్లెల్లో పండగైనా, పబ్బమైనా.. అహ్లాదమైనా.. అన్నింటికీ కల్లుతో ముడిపడిన జీవితాలే ఉండాయి. ఇక ఈ పల్లెల్లో అత్యంత అధికంగా డిమాండ్ ఉండే కల్లు తాటి, లేదా ఈత. అన్ని కాలలో విపరీతంగా అమ్మకాలు సాగించేంది మాత్రం ఈత కల్లు. ఈ కల్లును గీత కార్మికులు వ్యాపారదోరణిలోనే చూసేవారు.
అయితే కల్లు మాత్రమే కాకుండా నీరాను కూడా వ్యాపారధోరణిలో చూసేలా అలోచనలు వున్నా అది సాధ్యం కాలేదు. ఇక కేవలం గీతకార్మిక కుటుంబాలు మాత్రమే సేవించిన నీరాను ఇక రాష్ట్రవ్యాప్తంగా అందిరీకీ అందుబాటులోకి తీసుకురావాలని గీత సంఘాలు భావించాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గీత కార్మికులకు ప్రయోజనార్థం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యనగరాల్లో నీరా కేప్ లు ఏర్పాటు కానున్నాయి. చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు అందరూ నీరాను ఆస్వాదించవచ్చు.
ఉదయం ఏమీ తినకుండా నీరాను తగు మోతాదులో సేవిస్తే అనేక శరీర రుగ్మతలు నయం అవుతాయని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ కేప్ లలో కేవలం నీరాను మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. అయితే నీరాతో పాటుగా దాని సహ ఉత్పాదనలు నీరా ఉత్పత్తుల దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం కీలక ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి లైసెన్స్ లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ లైసెన్స్ తెలంగాణ నీరా చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు. సహజసిద్ధంగా చెట్ల నుంచి వస్తున్న నీరాను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నీరా మత్తు పదార్థం కాదని, ఔషధ గుణాలున్న సహజసిద్ధ ద్రావణమని పేర్కొన్నారు. దీనిని ప్రోత్సహించేందుకు నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నీరాతో పాటు నీరా ఉత్పత్తుల విక్రయాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more