Hindu temples attacked, vandalised by mob in Pakistan పాకిస్థాన్ లో హిందూ దేవాలయాల ధ్వంసం.. పండితుల ఇళ్లపై దాడులు

Hindu temple in pakistan s karachi attacked idols of deities vandalised report

karachi temple attack, Karachi, Hindu Temple in Pakistan, Temple attack, hindu temple attacked in pakistan, Pakistan temple attack, hindu temple attack, temple attack in karachi, attack on temple in karachi, karachi hindu temple attacked, hindu temple vandalized in karachi, mob attacks in karachi temple, temple attacked in pakistan, muslims attack hindu temple in pakistan, Hindu temples in Pakistan, hindu temple destroyed, Temple, temple attack case

A house of a Hindu temple's priest in Korangi area of Karachi in Pakistan was attacked by mob. The violent mob broke into the house of the priest and vandalised it. They even damaged the idol of Shri Mari Mata Mandir that the priest had kept in his house due to renovation work at the temple. Pakistan police have not arrested anyone in the incident so far. Meanwhile, a high-level inquiry in the incident has been initiated.

పాకిస్థాన్ లో హిందూ దేవాలయాల ధ్వంసం.. పండితుల ఇళ్లపై దాడులు

Posted: 06/09/2022 06:03 PM IST
Hindu temple in pakistan s karachi attacked idols of deities vandalised report

దాయాది పాక్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కరాచీలోని కోరంగి నెంబర్‌-5 ప్రాంతంలో జరిగింది. శ్రీమరిమాత ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి సమయంలో దుండగులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించారు.

ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు మోటార్ సైకిళ్లపై ఆలయం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని స్థానికుడు తెలిపాడు. గత కొద్ది రోజులుగా పాక్‌లోని హిందూ దేవాలయాలే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. అక్టోబర్‌లో సింధు నది ఒడ్డున ఉన్న ఓ చారిత్రాత్మక దేవాలయంపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. అధికారిక అంచనాల ప్రకారం, పాక్‌లో 7.5 మిలియన్ల మంది హిందువులు నివసిస్తున్నారు. అయితే, కమ్యూనిటీ ప్రకారం దేశంలో 90 లక్షల మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్‌లోని హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles