Minor girl raped in bus in Bihar, 2 held బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Nirbhaya like incident happened in bihar minor gang raped in a moving bus

gage rape on by-pass road, gang rape on minor, gang rape on minor in bihar, gang rape on minor in moving bus, gang rape on minor in bettiah bypass road, gang rape on minor in patna, gang rape on minor in west Champaran, gang rape on minor in Bihar, rape case, gangrape, minor girl, moving bus, West Champaran, Bettiah bus stand, patna, bihar, patna news, bihar news, crime news, bihar crime

Incidents like the Nirbhaya incident have been carried out in West Champaran, Bihar. Here a minor girl was gang-raped in a moving bus. Driver, Khalasi and conductor carried out this incident. Thereafter, the police took action and arrested the Khalasi and the conductor. The driver is still absconding.

బీహార్ లో నిర్భయ ఘటన: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Posted: 06/09/2022 03:34 PM IST
Nirbhaya like incident happened in bihar minor gang raped in a moving bus

దేశంలో నిర్భయ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి చేరకుంటుందా.? అన్న ప్రతినిత్యం అమె కుటుంబ సభ్యులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. నిర్భతలాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు ఏమాత్రం జంకడంలేదు. అమ్మాయిలు కనబడితే చాలు కామవాంఛతో రెచ్చిపోతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అన్న తేడా లేకుండా వీరిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక నడి వయస్కులే కాదు వృద్ద మహిళలపైనా లైంగికదాడులకు తెగబడుతున్నారంటే.. పురుషజాతిలో పశువాంఛ ఎంత దారుణంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది.

ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్యవిద్యార్థినిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నేరస్తులకు శిక్ష పడినా.. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా.. బీహార్‌లో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్‌లో కొందరు దుర్మార్గులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బీహార్‌లోని ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బస్‌ డ్రైవర్‌, కండక్టర్‌, హెల్పర్‌ సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో బాలిక వెస్ట్‌ చంపారన్‌లోని బెట్టయ్య ప్రాంతానికి వెళ్లడానికి ఎదురుచూస్తూ ఉంది. ఈ క్రమంలో బస్ రాగా.. ఆమె దానిని ఆపింది. అయితే.. వివరాలు అడగగా.. బస్ డ్రైవర్ బెట్టయ్య ప్రాంతానికే వెళ్తున్నట్లు చెప్పడంతో బాధితురాలు నమ్మింది. అనంతరం బాలిక బస్‌ ఎక్కగానే ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇవ్వగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత బాలికపై బస్ డ్రైవర్, కండక్టర్ సహా మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. బాలిక స్పృహలోకి రాగానే.. బస్సు డోర్లు వేసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వారు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను బెట్టియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనలో బస్‌ను సీజ్‌ చేసి, నిందితులను అరెస్ట్ చేశామని బెట్టియా పోలీసు అధికారి ముకుల్ పాండే తెలిపారు. పోక్సో తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సేకరించిన సాక్ష్యాల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు పాండే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh