ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 9వందల రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి సాధన సమితి ఆధ్వర్యంలో మందడం దీక్షా శిబిరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ , తాడకొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం భూములిచ్చి త్యాగాలు చేసిన రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని తెలిపారు. రైతుల కోరిక మేరకు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు రైతుల హక్కులను, జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తమ భూములను రాజధానికి ఇచ్చారని.. రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందేనని అన్నారు. అమరావతి రైతులకు ఆందోళన తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రగతి కోసమే ప్రభుత్వాలు కార్యక్రమాలను చేపబడతాయని.. అయితే ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరో ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరముందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పార్టీ మారినప్పుడల్లా రాజధాని మార్చడం మంచిది కాదని హితవు పలికారు. న్యాయం కోసం ఉద్యమాలతో ముందుకెళ్లాల్సిందేనని.. ప్రజా ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమరావతిలో నిర్మించి నిలిపివేసిన భవనాలు చూస్తుంటే బాధ కలుగుతుందని పేర్కొన్నారు. సంఘటిత ఉద్యమంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
వైసీపి ప్రభుత్వం ఎక్కడా లేని రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ఆత్మకూరులో టీడీపీ పోటీచేయట్లేదు కానీ.. వైసీపీ నేతల సవాళ్లు మాత్రం ఆగడం లేదన్నారు. నిజంగా వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే క్యాబినెట్ మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. జగన్ సీఎం కాగానే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు. రాజధానిలో మిగిలిన భూములు అభివృద్ధి చేసి ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కొనసాగించాలని.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అవసరం భీజేపికి ఉందని స్పష్టం చేశారు. హోదా, స్టీల్‌ప్లాంట్, పోలవరంపై ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని నారాయణ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more