Saint dies leaving over Rs. 2 lakh cash గుండెపోటుతో యాచకుడు మృతి.. ఇంట్లో సంచుల నిండా డబ్బు

Andhra pradesh beggar dies leaving over rs 2 lakh cash behind in kakinada

saint dies due to heart attack, saint ramakrishna dies due to cardiac arrest, police shocked seeing two gunny bags currency notes, revenue and police officials, Currency notes, begging, Saint Ramakrishna, Velangi village, Karapa Mandal, Kakinada, Andhra Pradesh, Crime

In a tragic incident, a saint who was living by begging locally died of a heart attack in his room in Kakinada. The locals who noticed it informed the police who went into the room to get shocked by seeing a huge sum of money in gunny bags.

బిక్షాటన చేసే సాధవు రామకృష్ణ గుండెపోటుతో మృతి.. ఇంట్లో సంచుల నిండా డబ్బు

Posted: 06/04/2022 08:57 PM IST
Andhra pradesh beggar dies leaving over rs 2 lakh cash behind in kakinada

ఆంధ్రప్రదేశ్ లో మరో సాధువు మరణానంతర ఘటన చర్చనీయాంశంగా మారింది. కాకినాడ సమీపంలో నివాసముందే ఓ సాధవు బిక్షాటన చేస్తూ జీవినం సాగించి.. గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. సాధువు మరణవార్త అందుకున్న పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు అతని అంత్యక్రియల కోసం వచ్చి.. ఇంట్లోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. అతని ఇంట్లో ఏకంగా రెండు గోనె సంచుల నిండా కరెన్సీ నోట్లు ఉండటమే అందుకు కారణం. ఈ క్రమంలో గోనె సంచుల్లోని డబ్బును లెక్కించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. డబ్బును తరలించిన తరువాత అతని దహన సంస్కారాలు చేశారు.

కాకినాడలో సమీపంలోని కరప మండల పరిధిలో వేళంగీ గ్రామానికి రామకృష్ణ అనే సాధువు ఐదేళ్ల క్రితం వచ్చి స్థానికంగా స్థిరపడ్డాడు. రక్షయంత్రాలు కడుతూ భక్తులు ఇచ్చిన డబ్బనును ఖర్చు చేయకుండా.. తన బోజనాది అవసరాలకు స్థానికంగా ఉన్న మఠంలో బోజనం చేస్తూ తన భక్తిని తీర్చుకునేవాడు. బిక్షాటన చేసే స్వామి కాబట్టి స్థానికులు టీ, కాఫీలు ఇచ్చినా డబ్బు తీసుకునేవారు కాదు. దీంతో ఒక్కో గ్రామానికి వెళ్లిన తిరిగి వేళంగికి చేరుకునేవారు. ఈ స్వామి ఈ గ్రామంలోని చేపట మార్కెట్ సమీపంలోగల ఓ గదిలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా, రామకృష్ణ సాధువు గత రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతుడి ఉంటున్న గదిని పరీశీలించారు. అందులోని రెండు సంచులు కనిపించాయి. వాటి నిండా నోట్ల కట్టలు.. చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధిజారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు గ్రామస్ధులు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల వరకూ బయటపడింది. డబ్బును పోలిస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. అతని సంబంధికులు ఎవరైనా వస్తే అందజేస్తామని అన్నారు. కాగా, ఏ కార్యం కోసమే సాధువు తనకు వచ్చిన డబ్బును అలా దాచారని స్థానికులు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Currency notes  begging  Saint Ramakrishna  Velangi village  Karapa Mandal  Kakinada  Andhra Pradesh  Crime  

Other Articles