Sonia, Rahul Gandhi get ED notices in National Herald case కాంగ్రెస్ అగ్రనేతలకు ఈడీ తాఖీదులు.. హాజరుకానున్న సోనియా, రాహుల్..

Ed summons sonia gandhi and rahul gandhi over national herald case

sonia gandhi, rahul gandhi, PMLA, National Herald case, money laundering, congress, Sonia Gandhi ED notices, Rahul Gandhi ED notices, National Herald case; Congress vendetta politics, money laundering, congress, vendetta politics, National politics

The enforcement directorate (ED) on Wednesday summoned Congress president Sonia Gandhi and party leader Rahul Gandhi in connection with the National Herald money laundering case. The case was registered recently to probe alleged financial irregularities in the party-promoted Young Indian that owns the National Herald newspaper.

కాంగ్రెస్ అగ్రనేతలకు ఈడీ తాఖీదులు.. హాజరుకానున్న సోనియా, రాహుల్..

Posted: 06/01/2022 05:05 PM IST
Ed summons sonia gandhi and rahul gandhi over national herald case

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా తెలిపారు. ఈ నెల 8న ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఈడీ కోరిందని పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, సోనియా జూన్‌ 8న ఈడీ కార్యాలయానికి వెళ్తారని ఈ పార్టీ అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు.

రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ లోపు తిరిగి వస్తే ఈడీ ఎదుట హాజరవుతారని, రాలేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈడీ నోటీసులపై రణదీప్‌ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. ప్రతిసారీ నేషనల్‌ హెరాల్డ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. బీజేపీ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందని, అగౌరవపరిచిందని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్‌ వారు దాన్ని అణవిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు మోదీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా ధర్నా చేస్తుంటే.. బీజేపీ ఎనిమిదేళ్ల పాలన వేడుకల్లో బిజీగా ఉందని ఆరోపించారు. మంగళవారం కుల్గామ్‌లో ఉపాధ్యాయురాలు రజనీ బాలాపై కాల్పులు జరుపడంతో ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో రాహుల్‌ స్పందించారు. కాశ్మీర్ లోయలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు

ప్రధాని గారూ, ఇది సినిమా కాదు నిజం. కశ్మీర్‌లో గత ఐదు నెలల్లో 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 18 మంది పౌరులు మరణించారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కుల్గామ్‌లో రజనీ బాలాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పాఠశాల వద్దకు చేరుకున్న రజనీపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఆమెను స్థానికులు, పాఠశాల సిబ్బంది జిల్లా దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రజనీ భర్త రాజ్‌కుమార్‌ సైతం ఉపాధ్యాయుడే. ఆయన కశ్మీర్‌ విభాగంలో పని చేస్తున్నారు. ఈ దంపతులకు 12 కూతురు ఉండగా.. తల్లిదండ్రులతో కలిసి ఆమె లోయలో నివాసం ఉంటున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles