ఆరడుగుల మనిషి అంగుల వెడల్సు వున్న బొద్దింకను చూసి భయపడి పెద్దగా కేకలు వేయడం చూశాం. మూడంగుళాల వెడల్పు వున్న ఎలుక, లేదా బల్లిని చూసి భయపడి ఇల్లు పీకి పందిరేసినంత పనిచేస్తారు. అంతేగా మరి మనసులో భయం అవహించి ఉంటే చిన్న చీమను చూసినా భయపడిపోతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ చిన్నారి ఏనుగు పిల్లలోనూ భయం అవహించింది. అందుకనే దానిని అక్కడి నుంచి తరిమేయాలని భావించింది. అయితే ఏనుగు భయపడినంతా పని జరిగింది. ఎందుకిలా.? ఎం జరిగిందీ.? అన్న వివరాల్లోకి వెళ్తే..,
నదిలో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఏనుగు పిల్లకు ఓ పక్షి కనబడింది. అయితే ఈ పక్షితో గతానుభవం ఉందో లేక ఇలాంటి ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురుకాగా చూసిందో తెలియదు కానీ.. పక్షిని చూడగానే తనకు దీనితో ఎక్కడ ఏలాంటి ప్రమాదం వస్తుందోనని భయపడింది. అంతే తాను నీళ్లు తాగే సమయంలో అదెక్కడ తనపైవాలి.. తన ముక్కుతో తన వీపును పొడుస్తుందోనని భావించిందో ఏమో తెలియదు కానీ దానిన అక్కడి నుంచి తరిమేసి తాపీగా నీళ్లను తాగాలని భావించింది. ఇక మరుక్షణం ఆలస్యం చేయకుండా పక్షిని అక్కడి నుంచి పంపిచేసేందుకు ప్రయత్నాలు చేసింది.
తన తొండంతో నీటిని తీసుకుని పక్షిపై చల్లేందుకు ప్రయత్నించింది. అయినా అక్కడి నుంచి పక్షి కదల్లేదు. దీంతో అలా వెనుదిరిగిన ఏనుగుపై పక్షి ఎగురుకుంటూ వచ్చి వాలిది. దీంతో తాను భయపడినట్లే జరిగిందనుకున్న ఏనుగు వెంటనే దానిని వీపు పై నుంచి తరమింది దీంతో అది కాస్తా కిందకు వచ్చింది. అదే అదనుగా భావించిన ఏనుగు పక్షిని కాలితో తన్నింది. పక్షి తప్పించుకుంది. దీంతో మరో కాలితో దానిని తన్నగా దానికి తగిలినా..సకాలంలో తప్పించుకోగలిగింది. దీంతో ఏనుగును ఫక్షి ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో నదిలో నీళ్లుకు బదులుగా అది పక్షిని తరిమేందుకే సమయాన్ని వెచ్చించి ఆయాసపడింది.
ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కాబ్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నదిలో నీళ్లు తాగుతున్న పక్షిపై ఓ పిల్ల ఏనుగు నీళ్లు చల్లుతూ టీజ్ చేస్తుంది. అనంతరం ఏనుగు వెళ్లిపోతుండగా పక్షి వెంటపడి మరీ దాన్ని పొడుస్తుంది. ‘తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూడడమంటే అది తెలివితక్కువ తనమే. ఈ పక్షిలాగా ఏనుగును ఉరికించే సత్తా అందరికీ ఉంటుంది.’ అని దీపాన్షు ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షా 83వేల మంది వీక్షించగా, 1,300 మంది లైక్ చేశారు.
किसी को छोटा जानकर उसे तंग करना, मूर्खता है.
— Dipanshu Kabra (@ipskabra) May 26, 2022
क्योंकि नन्हा पक्षी भी हाथी को नाच नचा सकता है. pic.twitter.com/AEpBFJyiDz
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more