F3 Will Entertain Nonstop, It’s A Promise: DSP ఎఫ్-3 చిత్రం చూసి నవ్వకుండా ఉండలేరు: దేవిశ్రీప్రసాద్

F3 will surely entertain the audience devi sri prasad

F3 movie, venkatesh daggubati, varun tej, tamannah bhatia, mehreen, Devi sri prasad, Anil Ravipudi, Tollywood, Telugu Movies, Entertainment

Venkatesh Daggubati and Varun Tej starrer F3 is gearing up for a wide release on May 27th. Ahead of the release, music director DSP said, “I can guarantee that F3 will make the audience laugh completely. Anil Ravipudi wrote and shot wonderfully.

ఎఫ్-3 చిత్రం చూసి నవ్వకుండా ఉండలేరు: దేవిశ్రీప్రసాద్

Posted: 05/21/2022 12:59 PM IST
F3 will surely entertain the audience devi sri prasad

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 3' ఈ నెల 27వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడికి కామెడీపై మంచి పట్టుంది. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసే తీరు చాలా బాగుంటుంది.

వెంకటేశ్ పాత్రను గురించి చెప్పేటప్పుడు వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ తో యాక్ట్ చేసి చూపిస్తారు. అలాగే వరుణ్ తేజ్ విషయంలోనూ. ఈ సినిమాకి ఆర్ ఆర్ చేస్తూ నవ్వు ఆపుకోలేకపోయాను. ఈ సినిమా చూస్తూ నవ్వకపోతే నా మీదొట్టు. ఈ సినిమా చూస్తుంటే ఒక జంధ్యాల.. ఒక ఈవీవీ గుర్తుకురావడం ఖాయం. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందరూ కూడా పోటీపడి మరీ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంతలా నాన్ స్టాప్ గా నవ్వించిన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూసిన తరువాత ఆర్ ఆర్ అద్భుతంగా ఉందనీ .. నాకు వంద హగ్గులు  .. వంద ముద్దులు అని అనిల్ అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles