Fresh case against Lalu Prasad, kin in land-for-job scam 'ల్యాండ్ ఫర్ జాబ్' స్కామ్: మరోసారి టార్గెటైన లాలూ యాదవ్

Fresh case against lalu prasad kin in land for job scam

Lalu Prasad Yadav Lalu Yadav CBI raid Lalu Prasad Yadav Central Bureau of Investigation land-for-job scam CBI raid Rabri Devi CBI raids Lalu Rabri lalu yadav news, supreme court, rajyasabha, lalu prasad, cbi, Land for job scam, Lalu prasad daughter, Railway recriutment scandal, appontments, Patna, Bihar, crime

Renewed trouble came to haunt RJD chief lalu-prasad-yadav conducted searches in 16 locations in three cities and registered a fresh case against him, wife and former Bihar CM Rabri Devi and two of their daughters in a railway recruitment scandal in which aspirants allegedly gave more than 1 lakh square feet of prime plots in Patna as bribe for jobs.

'ల్యాండ్ ఫర్ జాబ్' స్కామ్: మరోసారి టార్గెటైన లాలూ యాదవ్

Posted: 05/20/2022 04:29 PM IST
Fresh case against lalu prasad kin in land for job scam

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. వరుస వివాదాలతో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై బయటకు వచ్చిన ఆయన తాజాగా మరో కేసులో ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ సోదాలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాలూ కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2004 - 2009 మధ్య కాలంలో యూపీఐ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు.

ఆ సమయంలో రైల్వే డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆశావాహుల నుంచి భూములు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిలో అనేక మందికి ఉద్యోగాలు కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ లాలూపై కేసు నమోదు చేసింది. ఆయనతో పాటుగా లాలూ కుటుంబసభ్యుల పేర్లను కూడా సీబీఐ ఛార్జ్ షీట్‌లో నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి లాలూ ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పట్నా, గోపాల్‌గంజ్‌, ఢిల్లీతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ ఉమ్మడి బీహార్‌కు సీఎంగా పనిచేసిన కాలంలో కోట్ల రూపాలయల విలువైన దాణా కుంభకోణం చోటుచేసుకోవడం, సీబీఐ దర్యాప్తు తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు కావడం తెలిసిందే. దాణా కుంభకోణానికే సంబంధించిన ఇతర కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా తేలి, జైలు శిక్ష కూడా అనుభవించారు. రూ.139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఇటీవలే జైలు నుండి విడుదలై బయటకు వచ్చారు. 73 ఏళ్ల లాలూ వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఈక్రమంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో కుంభకోణం రుజువైందని సీబీఐ ఆరోపించడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. సీబీఐ తీరుపై ఆర్జేడీ నాయకులు మండిపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ నేతను టార్గెట్ చేశారని.. సీబీఐ తీరు పక్షపాతంగా ఉందని ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్‌లో ప్రస్తుతం జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ మిత్ర పక్షంగా ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ కొనసాగుతోంది. ఈ క్రమంలో బలమైన గొంతుకను అణచివేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత ఆలోక్ మెహతా ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh