నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు రోజుకో పూట బోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు కారణమైన పెట్రోల్, డీజిల్‌లపై పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకార ధోరణితో వ్యవహరిస్తూ పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించాలని సూచించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను అవి ఉపసంహరించుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.
దీంతో సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని సంజీవ్ బబాజ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం.. తగ్గినప్పుడు తదనుగుణంగా ధర తగ్గించాలని హితవు చెప్పారు. ద్రవ్యోల్బణంపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఉందని పేర్కొన్నారు. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్ను చాలా ఎక్కువ. ఇది మనకు తెలుసు. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరగడం చూశాం.
ఇప్పుడు చమురు ధరలు పెరిగిపోయాయి. దీనిపై పరస్పర సహకార ధోరణితో చర్చించాల్సి ఉంది. ఒక దేశం కోసం చివరికి మనం ఈ పని చేయాలి. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకున్నది. సరైన సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి అని సంజీవ్ బజాజ్ సూచించారు. గతంలో కూడా భూ సేకరణ చట్టం, వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని గుర్తించి వాటిని వెనక్కు తీసుకున్నామని సంజీవ్ బజాజ్ గుర్తు చేశారు. ధరల స్థిరీకరణపైనే విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more