West Bengal: Rs 3 lakh for biryani bill in hospital అధికారులకు అందించిన ఒక్క బిర్యాని ఖరీదు రూ.3 లక్షలు.!

Bill of biriyani costs 3 lakhs at hospital sparks controversy at katwa

biryani, cost of Biryani, Rs 3 lakh Biryani, Rs 3 lakh biryani in Katwa Sub-Divisional Hospital, Katwa Sub-Divisional Hospital, Sauvik Alam, hospital superintendent, Contractor, Kingshook, Goods supplier contract, 81 types of burglary bills, Dr Subarno Goswami, West Bengal Biryani, West Bengal

How much does a biryani cost in any restaurant? Maha however is up to three hundred. But only Rs 3 lakh per person for a biryani. Officials were also taken aback by the billing in lakhs for the biryani. The incident took place at Katwa Sub-Divisional Hospital in West Bengal.

అధికారులకు అందించిన ఒక్క బిర్యాని ఖరీదు రూ.3 లక్షలు.!

Posted: 05/16/2022 04:44 PM IST
Bill of biriyani costs 3 lakhs at hospital sparks controversy at katwa

సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగితే.. ఎంత ఎక్కువ వేసినా.. రూ.1000లోపు మాత్రమే ఉంటుంది. కానీ ఓ అధికారి కోసం తీసుకువచ్చిన బిర్యాని ఖరీదు వింటే మెతుకు కూడా మింగలేరు. ఏంటీ వెయ్యి రూపాయలను మించి ఉంటుందా ఏంటీ అంటారా.. ఎక్కడ వేలు.. ఏకంగా లక్షల రూపాయల ఖరీదు చేస్తే.. ఔనా.. బిర్యాని ఖరీదు లక్ష.. అంటే కాదు ఏకంగా మూడు లక్షలు అని చెప్పాల్సివస్తుంది.

ఏమీటీ చిత్రం.. ఓ అధికారి భుజించిన బిర్యానీ ఖరీదు ఏకంగా రూ. 3 ల‌క్ష‌లా.? అంటూ నోరెళ్లబెట్టకండీ.. ఈ బిర్యాని మ్యాటర్ లోకి ఎంటరయ్యేముందు.. ఆ బిల్లును ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి స‌మ‌ర్పించి అమోదముద్ర వసుకునే క్రమంలో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఆ వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం.. అంతుకుముందు ఇచ్చిన బిల్లులతో పాటు ఆ తరువాత సిద్దంగా వున్న ఇతర బిల్లుల బూజును కూడా దులిపింది. దీంతో అసుపత్రికి మెటీరియల్ సప్లయర్ కాంట్రాక్టు పోందిన వ్యక్తి అవినీతి బాగోతం బయటపడింది. దీంతో అసుపత్రి అధికారులు అతడిపై పోలీసులకు పిర్యాదు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్ ఈస్ట్ బ‌ర్ధామ‌న్ జిల్లాలోని క‌త్వా స‌బ్ డివిజ‌న్ ఆస్ప‌త్రికి కింగ్ షూక్ గోష్ అనే కాంట్రాక్ట‌ర్ ఫ‌ర్నీచ‌ర్, వాహ‌నాల‌తో పాటు అధికారుల కోరిక మేరకు అప్పుడప్పుడు బిర్యానీని స‌ర‌ఫ‌రా చేస్తుంటాడు. ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా సాగుతున్న అతని వ్యవహారంలోకి ఓ బ్రేక్ వచ్చింది. అప్పటివరకు ఉన్న అసుపత్రి సూపరింటెండెంట్ అక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో ఆ ఆస్ప‌త్రికి సౌవిక్ ఆలం అనే కొత్త సూప‌రింటెండెంట్ నియామ‌కం అయ్యారు. ఆయ‌న ముందు కాంట్రాక్ట‌ర్ రూ. కోటి విలువ చేసే బిల్లుల‌ను ఉంచాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల‌ను క్లియ‌ర్ చేయాల‌ని సూపరింటెండెంట్ అధికారుల‌ను ఆదేశించాడు.

అయితే సౌవిక్ ఆలం కాంట్రాక్ట‌ర్ స‌మ‌ర్పించిన బిల్లుల్లో 81 బిల్లుల‌ను బోగ‌స్‌గా గుర్తించాడు. అందులోని ఓ బిర్యానీ బిల్లు రూ. 3 ల‌క్ష‌లుగా ఉంది. దీంతో సూప‌రింటెండెంట్ షాక్ అయ్యారు. క్ష‌ణం ఆలోచించ‌కుండా పేషెంట్ వెల్ఫేర్ క‌మిటీతో సౌవిక్ ఆలం స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles