ఛత్తీస్‌గఢ్ లో విషాదం చోటుచేసుకుంది. రాయ్‌పూర్‌లో రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టులో ఫ్లైయింగ్ ప్రాక్టీస్ జరుగుతోంది. ఈ క్రమంలో హెలికాప్టర్ వేసుకుని ప్రాక్టీసుకు వెళ్లివచ్చిన పైలెట్లు.. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటల్లో పైలెట్లు ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.
కాగా వారిని అసుపత్రికి తరలించి చికిత్స అందించినా.. తీవ్ర గాయాల నేపథ్యంలో వారు చికిత్సకు స్పందించలేదు. దీంతో ఈ హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలెట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండే, కెప్టెన్ ఏపీ శ్రీవాత్సవ మరణించారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ప్రయాణికులు ఎవరు లేరు. కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనకు కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రంగంలోకి దిగాయి.
ఛాపర్ క్రాష్ లో ఇటీవల దేశ త్రివిధ దళాల అధినేత, బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 15 మంది మరణించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కొకనూర్ లో జిరగిన ఈ ఘటన తరువాత మళ్లీ అలాంటి ఘటనే చత్తీస్ గడ్ లో సంభవించడం విషాధాన్ని నిపింది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన పైలట్లకు నివాళులర్పించారు. ఇదొక బాధాకరమైన సంఘటన అని, మృతుల కుటుంబాలకు దేవుడు శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
Tragic #helicopterCrash accident occurred at Swami Vivekanand airport Raipur, two pilots captain AP Shrivastva and captain Panda died in the crash. Chhattisgarh govt helicopter, #AugustaWestland -109. Earlier there were several complaints about the condition of the copter (SM) pic.twitter.com/oyWy6mcPGr
— avdhesh (@aviavi1001) May 12, 2022
(And get your daily news straight to your inbox)
Jun 23 | కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయని, వాటికనుగూణంగా తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆకస్మిక సమ్మెకు దిగిన సినీకార్మికులకు టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన... Read more
Jun 23 | హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి జలక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి.. కౌన్సిలర్ స్తాయికి మాత్రమే పరిమితమైనా.. ప్రజలతో మమేకం అయ్యానని గత ఎనమిదేళ్లుగా పార్టీకి ఎనలేని... Read more
Jun 23 | ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విపక్షాల అరోపణలకు మరో సంఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన కౌన్సీలర్ లావణ్య..... Read more
Jun 23 | ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే... Read more
Jun 23 | మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో... Read more