రైలు ప్రయాణం చేసే అమ్మలకు రైల్వోశాఖ మధర్స్ డే సందర్బాన్ని పురస్కరించుకుని ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. అమ్మలు తమ చిన్నారి శిశువులతో కలసి రైలు ప్రయాణం చేసేప్పుడు వారికి కానీ లేక శిశువులకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా కొత్తగా ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై శిశివులు కలిగిన తల్లులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటినిండా నిద్రపోయేలా చేస్తోంది. తమ శిశివులను పక్కనే పడుకోబెట్టుకునే వీలుకలుగజేస్తోంది. ఇప్పటినుంచి రైలులో ప్రయాణించే తల్లుల కోసం ప్రత్యేకంగా ఇలాంటి సౌకర్యం అందుబాటులో రానుంది. అయితే పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతోంది.
ఈ క్రమంలోనే రైల్వేశాఖ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లక్నో – ఢిల్లీ మార్గంలో నడిచే లక్నో మెయిల్లో రెండు బెర్తులను ఏర్పాటు చేశారు. అయితే, బేబీ బెర్త్ కోసం ప్రత్యేకంగా రైల్వే ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. కొత్త సదుపాయం ప్రవేశపెట్టిన తర్వాత పాలు తాగే శిశువులతో ప్రయాణించే మహిళలు సాఫీగా ప్రయాణం చేస్తారని రైల్వేశాఖ ట్వీట్ చేసింది. లక్నో మెయిల్లోని త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రెండు బెర్త్‌లతో పాటు బేబీ బెర్త్‌ను ప్రవేశపెట్టినట్లు రైల్వేశాఖ ట్వీట్లో ‘బేబీ బెర్త్’ ఫొటోను షేర్ చేసింది.
త్వరలోనే బేబీ బెర్త్ సదుపాయాన్ని ఇతర రైళ్లలోను వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా లక్నో డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ బేబీ బెర్త్‌ను రైలు లోయర్ బెర్త్‌లో ఏర్పాటు చేశామని, అవసరం లేని సమయంలో బెర్త్‌ను కిందికి మడతపెట్టవచ్చని పేర్కొన్నారు. బెర్త్‌ను ఏర్పాటు చేసుకోవడం సులభమని చెప్పారు. 770 మిల్లీమీటర్ల పొడవు, 255 మిల్లీమీటర్ల వెడల్పు, 76.2 మిల్లీమీటర్ల ఎత్తు ఉండే.. ఈ బేబీ బెర్త్‌కు.. బెర్త్పైనున్న శిశువు సురక్షితంగా ఉండేలా పట్టీలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more