BJP following Gujarat Model; created 2 India: Rahul Gandhi మోడీ పాలన కార్పోరేట్ల వరం.. పేద, సామాన్యులకు శాపం: రాహుల్

Bjp following gujarat model created 2 india one for rich another for common people rahul gandhi

Rahuk Gandhi in Gujarat, Gujarat model, Rahul Gandhi slams modi, Narendra Modi, PM Modi, coronavirus pandemic,Rahuk Gandhi in Gujarat, Gujarat model, Rahul Gandhi slams modi, Narendra Modi, Rahuk Gandhi, Gujarat model, Narendra Modi, PM Modi, coronavirus pandemic, Gujarat Assembly Elections, Gujarat, Politics

Congress leader Rahul Gandhi on Tuesday (May 10) accused Prime Minister Narendra Modi of creating two Indias, one for the rich and another for the poor, and claimed that the resources of the country are being given to a few wealthy people.

ప్రధాని మోడీ పాలన కార్పోరేట్ల వరం.. పేద, సామాన్యులకు శాపం: రాహుల్

Posted: 05/10/2022 07:23 PM IST
Bjp following gujarat model created 2 india one for rich another for common people rahul gandhi

దేశంలోని పేదల సంక్షేమాన్ని నిత్యం జపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. నిజానికి దేశ:లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను మరింత ఉన్నతస్థాయిలో నిలిపే ప్రయత్నాలే చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని పెదవులను దాటి వచ్చే పేదల అన్న మాట.. కేవలం జపం మాత్రమేనని, కానీ వారి కోసం ఆయన చేసింది ఏమీ లేదని రాహుల్ తీవ్రంగా దుయ్యబట్టారు. వారికోసం కేంద్రంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, వాటికి విధిల్చిన నిధులు చూస్తే ఈ విషయం ఎవరికైనా అవగతం అవుతుందని పేర్కోన్నారు.

ఈ ఏడాది చివ‌రిలో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రాహుల్ గాంధీ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశాన్ని సంప‌న్నులు, పేద‌లు అంటూ రెండు భారత్‌లుగా సృష్టించార‌ని మండిప‌డ్డారు. దేశంలో కీల‌క వ‌న‌రుల‌ను కొద్దిమంది సంపన్నుల‌కు దోచిపెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ద‌హోద్ జిల్లాలో ఆదివాసీ స‌త్యాగ్రహ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 2014లో మోదీ దేశ ప్ర‌ధాని ప‌గ్గాలు చేపట్ట‌కముందు గుజ‌రాత్ సీఎంగా ఉన్నార‌ని, గుజ‌రాత్‌లో ఆయ‌న చేసిన ప‌నులే ఇప్పుడు దేశంలో చేస్తున్నార‌ని దీన్ని గుజ‌రాత్ మోడ‌ల్‌గా చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

మోదీ సంప‌న్నులు, పేద‌ల కోసం సృష్టించే రెండు భార‌త్‌ల‌ను కాంగ్రెస్ పార్టీ కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. గుజ‌రాత్‌లో బీజేపీ ప్ర‌భుత్వం గిరిజ‌నుల హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని ఆరోపించారు. కాషాయ సర్కార్ మీకు ఎలాంటి మేలు చేయ‌కుండా మీ వ‌నరుల‌ను లాగేసుకుంటోంద‌ని ఆరోపించారు. గిరిజ‌నులు త‌మ హ‌క్కుల‌ను సాధించుకుంటేనే వారికి రావాల్సిన వాటా ద‌క్కుతుంద‌ని అన్నారు. గిరిజ‌నుల కష్టంతో గుజ‌రాత్‌లో రోడ్లు, బ్రిడ్జిలు, భ‌వ‌నాలు, మౌలిక వ‌స‌తులు స‌మ‌కూరినా వారు తిరిగి పొందింది ఏమీ లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గిరిజ‌నుల‌కు విద్య‌, వైద్యం అందుబాటులో లేద‌ని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles