Kedarnath Temple opens for pilgrims వైభవోపేతంగా తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు.!

Grand opening of kedarnath temple for devotees cm in attendance

kedarnath, kedarnath registration, kedarnath temple, kedarnath yatra, char dham yatra, char dham yatra 2022, kedarnath guidelines, kedarnath airport, kedarnath and badrinath, kedarnath altitude, kedarnath weather, kedarnath temperature, kedarnath opening date 2022, kedarnath booking, kedarnath booking badrinath, kedarnath badrinath registration, badrinath kedarnath, badrinath kedarnath temple, kedarnath closing date 2022, kedarnath darshan, kedarnath gate opening date 2022, kedarnath elevation, kedarnath e pass registration, kedarnath e pass registration 2022, kedarnath dham

The Kedarnath Temple in Uttarakhand was opened for devotees as thousands of pilgrims visited the holy site. Kedarnath’s Rawal Bhimashankar Linga opened the doors of Baba Kedar at 6.25 am. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami, along with his wife, also offered prayers at the Kedarnath temple.

వైభవోపేతంగా తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు.!

Posted: 05/06/2022 11:59 AM IST
Grand opening of kedarnath temple for devotees cm in attendance

దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఇవాళ తెరుచుకున్నాయి, ఈ సందర్భంగా తొలి దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తులు కేదార్‌నాథ్ ఆలయానికి తరలివచ్చారు. ఏళ్ల నాటి సాంప్రదాయ ఆచారాన్ని అనుసరించి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన భార్య గీతా ధామితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

కాగా, ఆలయం భక్తుల సందర్శనార్థం తెరుచుకుంటున్న నేపథ్యంలో.. ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. గత ఏడాది నవంబర్ 6న ఆరు నెలల పాటు మంచు నేపథ్యంలో ఆలయాన్ని మూసివేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ దేవాలయం యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్‌లతో సహా 'చార్ ధామ్'గా పిలుచుకునే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఎనిమిదో శతాబ్దంలో జగద్‌గురు ఆదిశంకరాచార్యచే కేదార్‌నాథ్ ఆలయం నిర్మితమైంది.

ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల పోర్టల్‌లను తెరవడంతో వార్షిక చార్‌ధామ్ యాత్ర మే 3న అక్షయ తృతీయ శుభ సందర్భంగా ప్రారంభమైంది. బద్రీనాథ్ ఆలయ పోర్టల్స్ మే 8న తెరుస్తారు. ఈ నెల ప్రారంభంలో చార్ ధామ్‌లను సందర్శించే యాత్రికుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. బద్రీనాథ్ వద్ద రోజుకు 15,000 మంది, కేదార్‌నాథ్ వద్ద 12,000, గంగోత్రి వద్ద 7,000, యమునోత్రికి 4,000 మంది యాత్రికులను అనుమతిస్తారు. 45 రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం యాత్రికులు కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ గానీ, టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడం గానీ తప్పనిసరి కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles