Those who don’t love Hindi are foreigners: U.P. Minister హిందీ బాష మాట్లాడలేనివాళ్లు ఇండియా వదిలివెళ్లాలి: యూపీ మంత్రి

Those who do not speak hindi should leave india up minister sanjay nishad

people who didn’t love Hindi are foreigners, people who didn’t speak Hindi leave India, Nirbal Indian Shoshit Hamara Aam Dal, sanjay nishad, nishad party, Uttar pradesh minister, Hindi, hindi controversy, national language, BJP, Samajwadi party, uttar pradesh, Politics

Uttar Pradesh fisheries minister Sanjay Nishad stoked a controversy by saying that people who didn’t love Hindi would be assumed to be foreigners and those who didn’t speak the language should leave the country, drawing sharp responses from opposition parties. The minister is the chief of Nirbal Indian Shoshit Hamara Aam Dal, commonly referred to as the NISHAD party, which is an ally of the ruling Bharatiya Janata Party (BJP).

హిందీ బాష మాట్లాడలేనివాళ్లు ఇండియా వదిలివెళ్లాలి: యూపీ మంత్రి

Posted: 04/30/2022 03:53 PM IST
Those who do not speak hindi should leave india up minister sanjay nishad

ఇండియా పాకిస్థాన్ అంటూ చర్చలకు దేశంలోని రాజకీయా పార్టీలు తెరతీయగా, ఆ తరువాత గోవుల రక్షణపై చర్చలు తీసి.. గోమాంసాన్ని తరలిస్తున్నారన్న అభియోగాలపై దళితులు, ముస్లింలపై దాడులకు పాల్పడ్డాయి. మూకుమ్మడి దాడులు చేసి.. ప్రాణాలను తీసాయి. ఇటీవలి కాలంలో ఓ రాష్ట్రంలో హిజబ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అది ముగిసీముగియగానే మసీదులపై లౌడ్ స్పీకర్ల వ్యవహారం.. ఇలా ప్రజలను ఉక్కిరిబిక్కిర చేసే సమస్యలను కృత్రిమంగా సృష్టిస్తూ.. వారిని నిజంగా చుట్టుముట్టిన సమస్యలపై మాత్రం దృష్టిని మళ్లించే ప్రయత్నాలు సాగుతున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా జాతీయ బాషగా హిందీ అనే అంశం రాజుకుంది.

దీనికి ఉత్తరప్రదేశ్​ మంత్రి సంచలన వ్యాఖ్యలతో ఆజ్యం పోశారు. హిందీ భాష రాని వారు దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలన్నారు. బీజేపీ మిత్రపక్షానికి చెందిన నిషాద్​ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సంజయ్​ నిషాద్​ ఈ వ్యాఖ్యాలు చేశారు. "ఇండియాలో జీవించాలి అనుకుంటే.. హిందీని ప్రేమించాల్సిందే. మీకు హిందీ ఇష్టంలేకపోతే.. మీరు విదేశీయులతో సమానం. విదేశీ శక్తులతో మీకు సంబంధం ఉన్నట్టు. మాకు ప్రాంతీయ భాషలపై గౌరవం ఉంది. కానీ ఇది ఇండియా. అంటే 'హిందుస్థాన్​'. భారత రాజ్యాంగం ప్రకారం.. హిందుస్థాన్​ అంటే.. హిందీ మాట్లాడే ప్రజల ప్రాంతం," అని మీడియాకు వెల్లడించారు సంజయ్​ నిషాద్​. అందుకే.. హిందీ మాట్లాడలేకపోత, ఇండియాను విడిచివెళ్లిపోవాలని సంజయ్​ నిషాద్​ సూచించారు.

"చట్టాల ప్రకారం దేశ జాతీయ భాష హిందీ. చట్టాన్ని ఉల్లంఘించే వారిని జైలులో పెట్టాలి. హిందీ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి.. దేశంలో అలజడులను సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారు," అని సంజయ్​ పేర్కొన్నారు. వాస్తవానికి.. దేశంలోని ఏ భాషకి కూడా రాజ్యంగం.. 'జాతీయ భాష' అనే గుర్తింపును ఇవ్వలేదు. రాజ్యంగంలోని 8వ షెడ్యూల్​ ప్రకారం.. దేశంలో 22 'అధికార భాషలు' ఉన్నాయి. అధికారిక కార్యకలాపాల కోసం ఇంగ్లీష్​, హిందీని ఉపయోగించుకోవాలని మాత్రమే 1963 అధికారిక భాషల చట్టం చెబుతోంది.

సంజయ్​ నిషాద్​ వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. మంత్రిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. "నాకు హిందీ అంటే ప్రేమ ఉంది. అది నా మాతృభాష. అదే సమయంలో.. తమ మాతృభాషను ప్రేమించేవారి పట్ల నాకు గౌరవం ఉంది. భాషల్లోని వైవిధ్యాల పట్ల మనం సంతోషంగా ఉండాలి. దేశంలోని పౌరులు ఎలాంటి భాషలు మాట్లాడినా.. వారు భారతీయులే అవుతారు. భారత రాజ్యాంగం.. అనేక భాషలకు గుర్తింపును ఇచ్చింది. మాతృభాషపై ఇష్టం ఉన్న వారు.. దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాము," అని ఎస్​పీ ప్రతినిధి అబ్దుల్​ హఫీజ్​ గాంధీ వెల్లడించారు.

దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, రైతు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. బీజేపీ, దాని మిత్రపక్షం హిందీ వ్యవహారంపై చర్చలు నడిపిస్తోందని బీఎస్పీ నేత ఒకరు మండిపడ్డారు. దేశంలో ఇంధన ధరల ప్రభావం వాహనదారులపై ఎంతగా పడుతుందో తెలియకుండా.. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రణపై పట్టుకోల్పోయిన కేంద్ర సర్కారు ప్రజల మధ్య వివాదాలను రేపి.. దృష్టిని అటు మళ్లిస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే.. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం.. సంజయ్​ నిషాద్​ వ్యాఖ్యలను సమర్ధించకపోవడం గమనార్హం. హిందీ మాట్లాడలేకపోతే ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోవాలన్న మంత్రి వ్యాఖ్యలు తప్పు అని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh