పెద్దలు ఏది చెప్పినా అది మన మంచికే అన్న విషయం తెలియని నేటి తరం.. వారిదో చాదస్తమని పేరు పెట్టేస్తుంటారు. కానీ దాని వెనుక దాగిన నిజం ఏంటో తెలిసే సమయం వచ్చినప్పుడు మాత్రం ఔను.. అని నాలుక కరుచుకోవడం తప్ప మరేం చేయలేరు. మరీ ముఖ్యంగా అనాటి పరిస్థితుల్లో వారు తమ ఇళ్లలోకి రావడం కానీ వెళ్లడం కానీ కూడా గుట్టుగా చేసేవారు. అయితే అది దొంగల బెడద తప్పించుకోవడానికి మనం అనుకునేవాళ్లం. వాళ్లు కూడా అలాగే చెప్పేవారు. ఓరి నీ చాదస్తం.. ఈ కాలంలో దొంగలు ఉన్నా ఇళ్లలోకి వచ్చారంటే సిసిటీవీ ఫూటేజీలు గట్రా వున్నాయిగా.. అంటూ సముదాయించే ప్రయత్నం చేస్తాం..
ఇక మరింత ధైర్యాన్ని అందించేందుకు.. ఇప్పుడున్న సాంకేతికతతో ఇంటి తలుపులు ఎవరు తెరవాలన్నా కుదరదు. ఎందుకంటే భయోమెట్రిక్ విధానం కూడా అందుబాటులోకి వచ్చిందని చెబుతాం. కానీ అసలు విషయం ఏంటంటే దొంగలే కాదు.. మనుషులను అనుకరించే మృగాలు కూడా ఇలానే చేస్తాయన్న విషయం మనకు తాజాగా తెలియవచ్చింది. అందుకు కారణం ఈ వీడియోనే. ఎలుగుబంట్లు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. వాటిని చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు.అయితే, అమెరికాలో ఓ ఎలుగుబంటి గోడదూకి నేరుగా ఇంటికే వచ్చేసింది.
ఇంటి డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సీసీటీవీ ఫుటేజీ క్లిప్‌ను న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ కన్జర్వేషన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. కచ్చితంగా ఆ ఇల్లు ఎక్కడుందో అధికారులు పేర్కొనలేదు. ఈ వీడియోలో గోడదూకి వచ్చిన ఎలుగుబంటి తన పళ్లతో డోర్ ముందుభాగాన్ని తెరుస్తుంది. అయితే, వెనుక ఉన్న చెక్క తలుపును తెరవలేకపోతుంది. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోతుంది. వేసవితాపం తట్టుకోలేక ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తాయని, ప్రజలు వాటికోసం ఆహారాన్ని బయటే ఉంచాలని అధికారులు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more