Relief to 6 IAS Officers from Social work for eight weeks ఆ ఆరుగురు ఐఏఎస్ అధికారులకూ హైకోర్టులో బిగ్ రిలీఫ్..

Ap highcourt suspends social work punishment awarded to six ias officers for eight weeks

Andhra Pradesh High Court,, contempt case, punishment to IAS officers, Justice Battu Devanand, Justice Ahsanuddin Amanullah, Justices T. Rajasekhar Rao, IAS officers, M.M. Naik, B. Rajasekhar, J. Syamala Rao, V. Chinna Veerabhadrudu, Y. Srilakshmi, G. Srkr Vijay Kumar, Gopal Krishna Dwivedi, Girija Shankar, contempt case, Andhra Pradesh, Crime

A Division Bench of the Andhra Pradesh High Court, comprising Justices Ahsanuddin Amanullah and T. Rajasekhar Rao, on Thursday suspended the ‘social work’ punishment awarded by Justice Battu Devanand to IAS officers M.M. Naik, B. Rajasekhar, J. Syamala Rao, V. Chinna Veerabhadrudu, Y. Srilakshmi and G. Srkr Vijay Kumar in a contempt case last month, for eight weeks in response to the appeals filed by them.

ఆ ఆరుగురు ఐఏఎస్ అధికారులకూ హైకోర్టులో బిగ్ రిలీఫ్..

Posted: 04/28/2022 07:43 PM IST
Ap highcourt suspends social work punishment awarded to six ias officers for eight weeks

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్‌లకు స్వల్ప ఊరట లభించింది. కోర్టు ధిక్కార కేసులో మొత్తం ఎనమిది మంది ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం సోషల్ వర్క్ కింద వారంలో ఒక్క రోజు వీరికి శిక్షను విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆరుగురు ఐఏెఎస్ అధికారులకు ఈ శిక్ష నుంచి 8 వారాల పాటు న్యాయస్థాన ధర్మాసనం ఉపశమనం కల్పించింది. కోర్టు ధిక్కరణ కింద 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు సింగిల్‌ జడ్జి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని శిక్ష విధించారు. ఈ శిక్షను డివిజనల్‌ బెంచ్‌లో గతవారం ఇద్దరు ఐఏఎస్‌లు సవాల్‌ చేయగా.. 8 వారాలపాటు ధర్మాసనం సస్పెండ్‌ చేసింది.

మరో ఆరుగురు ఐఏఎస్‌లు ఇప్పుడు సవాల్ చేయగా.. హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఆరుగురు ఐఏఎస్‌ల శిక్షను 8 వారాలు సస్పెండ్‌ చేసి.. తదుపరి విచారణను కూడా 8 వారాలకు కోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల ఆవరణలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్మించొద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ కొన్ని చోట్ల ఆ తీర్పును పాటించకుండా నిర్మాణాలు జరగడంతో హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలైంది. దీనిపై వాదనలు విన్న కోర్టు 8 మంది ఐఏఎస్‌ అధికారులకు శిక్ష, జరిమానా విధించింది.

ఐఏఎస్ అధికారులు క్షమాపణలు కోరడంతో సామాజిక సేవ చేయాలని శిక్ష విధించింది. కోర్టు నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు వారికి నచ్చిన సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా 8మంది ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. తాత్కాలికంగా శిక్ష వాయిదా పడింది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles