దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ కూడా పెరుగుతోంది. ఇది దేనికి సంకేతమన్న ప్రశ్నలు గతవారంలోనే అక్కడి స్థానికుల్లో ఉత్పన్నమయ్యాయి. కాగా ఇది నాలుగో దశ కరోనా వేవ్ కు కారణమా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తం కాగా, అది నిజమేనని తాజాగా బీజేపి పాలిత కర్ణాటక మంత్రి స్సష్టం చేశారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కరోనా నాలుగో దశపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరోనా ఫోర్త్ వేవ్ జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం ఉంటుందని అన్నారు.
బెంగళూరులో పాత్రికేయుల సమావేశంలో ఆయన కరోనా నాలుగో దశకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కాన్పూరు ఐఐటీ నిపుణులు అంచనా వేశారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కరోనా ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. వ్యాక్సిన్లు తీసుకోనివారు వాటిని వేయించుకోవాలని, మాస్కులు ధరించడం, శానిటైజర్ ను చేతులకు రుద్దడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం.. ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కాన్పూరు ఐఐటీ పరిశోధకులు ఇచ్చిన నివేదికలోని విషయాలను మంత్రి వెల్లడించారు.
కాన్పూర్ ఐఐటీ అంచనాల ప్రకారం జూన్ చివరలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమై ఆ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ ప్రభావం సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు కొనసాగే అవకాశం ఉంది. కరోనాపై కాన్పూరు ఐఐటీ శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమయ్యాయని, కాబట్టి తాజా నివేదికలోని అంశాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మునుపటిలా జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని మంత్రి సూచించారు. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కొవిడ్ నాలుగో దశ కేసులు స్వల్పంగా ఉన్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more