"I Want My Chicken" Woman Calls Police At KFC కెఎఫ్సీపై పోలీసులకు మహిళ పిర్యాదు.. వచ్చి ఏం చేశారంటే..!

I want my chicken woman calls police at kfc

woman, police, fewer pieces of chicken, dial police, 911, getting all her chicken, fast food restaurant, KFC, emergency operator, four pieces of chicken, paid for eight, Cleveland, United States, Crime

A woman from Cleveland in the United States recently called the police as she claimed that she received fewer pieces of chicken than she paid for. The woman called 911 and said on the phone that she needed help “getting all her chicken” from fast food restaurant KFC. She told the emergency operator that the restaurant had only given her four pieces of chicken while she had paid for eight.

కెఎఫ్సీపై పోలీసులకు మహిళ పిర్యాదు.. వచ్చి ఏం చేశారంటే..!

Posted: 04/25/2022 09:11 PM IST
I want my chicken woman calls police at kfc

పోలీసు ఉద్యోగం చేయడమంటే చాలాకష్టం. ఎప్పుడు ఏ విధులు పడతాయో తెలియదు.. ఎక్కడ ఏ నేరాలు జరుగుతాయో కూడా తెలియకుండానే.. అన్నింటికీ బాద్యలుగా కావాల్సివుంటుంది. అటు మీడియా, ఇటు ఉన్నతాధికారులు అడిగే ప్రశ్నలతో సతమతం కావడమే కాదు.. ఇంట్లోని కుటుంబసభ్యులకు కూడా కనీసం సమయం కేటాయించలేక ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఇదిచాలదన్నట్లు రాజకీయ నాయకుల హుకుంల మధ్య అన్నింటినీ సర్ధుకుపోతూ విధులు నిర్వహిస్తూ బతుకులు ఈడవాల్సివస్తుంది. ఇక ఉన్నవాటికి తోడు ఆకతాయిల బెడద కూడా.

పోలీసులకు ఫోన్లు చేసి ఆటపట్టిస్తూ ఉండే వార్తలు కూడా నిత్యం చూస్తూనే ఉంటాము. ఇంకొందరు.. చిన్నచిన్న విషయాలకే పోలీసులకు ఫోన్​ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాజాగా.. అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కేఎఫ్​సీకి వెళ్లిన ఓ మహిళ.. చికెన్​ ముక్కలు తక్కువ ఇచ్చారని పోలీసులకు ఫోన్​ చేయడం విశేషం..!అమెరికాలోని క్లీవ్​ల్యాండ్​లో ఇటీవలే జరిగింది ఈ ఘటన. ఓ మహిళ.. కేఎఫ్​సీకి వెళ్లింది. 8 చికెన్​ పీస్​ల కోసం ఆర్డర్​ ఇచ్చి.. డబ్బులు కట్టింది. కానీ తనకు నాలుగే చికెన్​ పీస్​లు రావడంతో కోపం తెచ్చుకుంది. వెంటనే 911కు ఫోన్​ చేసింది. 'నాకు నాలుగు పీస్​లే వచ్చాయి. నాకు నా చికెన్​ మొత్తం కావాలి. మీరు సాయం చేయండి,' అని చెప్పుకొచ్చింది.

ఫోన్​ ఎత్తిన వ్యక్తి ఒక్కసారిగా షాక్​ అయ్యారు. కానీ ప్రశాంతంగా జవాబిచ్చారు. 'మీకు చికెన్​ పీస్​లు కావాలా? ఈ విషయంలో పోలీసులు ఏం చేయలేరు. ఇది క్రిమినల్​ వ్యవహారం కాదు. ఈ విషయాన్ని మీరు పోలీసులతో కాకుండా.. కేఎఫ్​సీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి,' అని చెప్పుకొచ్చి ఫోన్​ పెట్టేశారు. అయినప్పటికీ.. ఘటనాస్థలానికి ఓ పోలీసును పంపించారు. అనుకున్న విధంగానే.. ఈ వ్యవహారంలో ఆ పోలీసు ఏం చేయలేకపోయారు. ఈ ఘటన అనంతరం పోలీసు అధికారులు.. ప్రజలకు ఓ ప్రకటన జారీ చేశారు. "911కు అత్యవసరమైతేనే కాల్​ చేయండి. చిన్న చిన్న విషయాల కోసం 911ను ఉపయోగించుకోకండి. మీకు సహాయం చేయడం కోసమే మేము ఇక్కడ ఉన్నాము. కానీ కేఎఫ్​సీలో చికెన్​ కావాలనేది మా పరిధిలోకి రాదు," అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles