Gudivada RI Aravind Attacked by Sand Mafia ఆర్ఐపై మైనింగ్ మాఫియా హత్యాయత్నం

Gudivada revenue inspector aravind attacked by sand mafia

Matti Mafia, Revenue Inspector, RI Aravind, illegal excavation of mud, illegal transportation of mud, moturu, Gudivada, Krishna district, Andhra pradesh, crime

TDP national general secretary Nara Lokesh on Friday condemned the attack on RI Aravind. Some unidentified persons have assaulted the RI when he tried to stop illegal excavation and transportation of mud. He accused Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy of encouraging illegal activities in the state.

అర్థరాత్రి మట్టిమాఫియా ఆగడాలు.. ఆర్ పై హత్యాయత్నం..

Posted: 04/22/2022 01:43 PM IST
Gudivada revenue inspector aravind attacked by sand mafia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ఎదురించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను కూడా అక్రమార్కుల అనుచరులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా కృష్ణా జిల్లాలో ఈ అక్రమాలు అత్యధికంగా సాగుతున్నాయి. ఏ జిల్లా చూసినా ఏముంది గర్వకారణం.. అదే అక్రమాలు, దౌర్జన్యాల భాగోతం అన్నట్లుగా మారింది వ్యవహారం. ఈ అక్రమాలు తప్పు కదా అన్న మాట వినపబడితే చాలు వారి నోటి నుంచి మరోమాట రాకుండా కట్టడి చేస్తున్నారు. ఇక గొంతెత్తి అరిచే ధైర్యం ఎవరు చేస్తారు.

అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది. ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు.? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మాత్రం వారేం చేస్తారు. వారు మాత్రం మానవమాత్రులు కాదా.? వారికి కుటుంబాలు లేవా.? అన్న వాదనలు కూడా అక్రమార్కుల నుంచి వినిపిస్తోంది. అయినా గొంతెత్తి అరిచే వాళ్లు.. అవినీతిని సహించని అధికారులు ఇంకా ఉన్నారు. అయితే వారిలోని ధైర్యాన్ని కూడా అక్రమార్కులు హరించేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, యంత్రాంగం ఏది మారినా.. ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఆగడాలకు మాత్రం అడ్డుఅదుపు లేకుండా పోతోంది.

తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారి ఆర్‌ఐపై మట్టిమాఫియా మనుషులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడినవారు అక్రమార్కులకు అధికార వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకే రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పై జేసీబీతో దాడి చేశారు. గుడివాడ మండలం మోటూరులో ఈ హత్యాయత్నం జరిగింది. అధికార పార్టీ వర్గీయులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులే ఈ మట్టిమాఫియాను చేపడుతున్నారన్న అరోపణలు ఉన్నాయి.

గుడివాడ మండలం మోటూరులో పల్లె నిద్రపోయిన వెంటనే నిద్రలేస్తున్న అక్రమార్రులు తమ అక్రమ వ్యాపారాలకు పనిచెబుతున్నారు. రాత్రి వేళ మట్టితవ్వకాలు చేపడుతూ.. ఉదయానికి గొతులమయంగా మార్చేస్తున్నారు. అయితే పక్క సమాచారం అందడంతో.. మట్టిమాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై బెదిరింపులకు దిగారు. అప్పటికీ తమ స్వరం మార్చని అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కులుగా తమ నిబద్దతను చాటుకునే అధికారులను ఏకంగా హత్యమార్చే ప్రయత్నాలకు కూడా తెగబడుతున్నారు.

మోటూరులో అక్రమ మట్టితవ్వకాలను ఆర్‌ఐ అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు ఆయనపై దాడికి దిగి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే తృటిలో తప్పించుకున్న ఆర్ఐ అరవింద్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గుడివాడ తహశీల్దార్‌ ఫోన్‌ చేసి.. అక్రమ మట్టితప్వకాలు జరుగుతున్నాయి.. వాటిని అపాలని అదేశించారు. దీంతో వీఆర్‌ఏ, వీఆర్వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లగా.. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో కొంతమంది మట్టితవ్వకాలు చేపడుతున్నారు.. ఆపాలని చెప్పినా.. వారు పెడచెవిన పెట్టారు. నాతో వాగ్వాదం చేశారే తప్ప తవ్వకాలు అపలేదు. అంతేకాదు తనపై జేసీబీతో దాడి చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌ చేశారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles