Tension prevails in Nizamabad during Hanuman Shobha yatra హనుమాన్ శోభాయాత్ర: నిజామాబాద్ లో టెన్షన్..

Tension prevails in nizamabad after scuffle between bjp leader during hanuman shobha yatra

MP Dharmapuri Aravind, Nizamabad, Yendala Lakshmi Narayana, BJP State VP, Groupism, Group politics in BJP, state executive member Dhanpal SuryaNarayana, Hanuman Shobhauyatra, Tension in Telangana, Tension in Nizamabad, scuffle between BJP activists, Nizamabad, Telangana, Politics

Tension prevailed in Nizamabad district of Telangana on Saturday after a slight scuffle broke out between two groups of Bhartiya Janata Party (BJP) activists over the Hanuman Shobha Yatra. The trouble began when a former MLA and BJP Leader Lakshmi Narayana asked the organizers to start the procession. State executive councilor Dhan Paul Suryanarayana, who was present there, objected and said that the procession would start under the auspices of the MP.

హనుమాన్ శోభాయాత్ర: నిజామాబాద్ లో టెన్షన్.. బీజేపిలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు

Posted: 04/16/2022 08:42 PM IST
Tension prevails in nizamabad after scuffle between bjp leader during hanuman shobha yatra

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణగుప్తపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ చేయి చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం హనుమాన్ శోభయాత్ర సందర్భంగా జరిగింది. నిజామాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది శోభయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జిల్లా కేంద్రంలో జరిగే శోభయాత్రను హిందూ ధార్మిక సంస్థలు, భజరంగ్ దళ్, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. శనివారం హనుమాన్ జయంతి శోభయాత్ర ప్రారంభానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరుకావాల్సి ఉంది.

ఉదయం 11 గంటలైనా శోభయాత్ర ప్రారంభం కాకపోవడంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ శోభయాత్రను ప్రారంభించాలని నిర్వాహకులను కోరారు. అక్కడే ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ ఆధ్వర్యంలో శోభయాత్ర ప్రారంభం కానుందని, ఎంపీ సైతం సమీప ప్రాంతానికి వచ్చారని అప్పటి వరకు ఆగాలని కోరారు. అయితే, దేవుడి శోభయాత్ర ఏ ఒక్కరి కోసం ఆపడం సరికాదని వెంటనే ప్రారంభించాలని లక్ష్మీనారాయణ కోరారు. పోలీసులు కూడా అప్పటికే శోభయాత్రను ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్నారు.

ఆ సమయంలో శోభయాత్రను ప్రారంభించేందుకు యెండల యత్నించగా ధన్‌పాల్ వారించారు. దానితో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే యెండల ధన్‌పాల్‌పై చేయి చేసుకుని తోసి వేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరి మధ్య గొడవ జరుగకముందే పోలీసులు జోక్యం చేసుకున్నారు. కానీ, అప్పటికే రెండు వర్గాలు చేరోవైపు చేరి ఒకరు ప్రారంభించాలని, మరొకరు శోభయాత్రను ఆపాలని యత్నించారు. పోలీసులు ఇరువర్గాలను శోభయాత్ర రథం నుంచి పక్కకు జరిపి ప్రారంభించారు.

కంటేశ్వర్ గుడి వద్ద ప్రారంభమైన రథయాత్ర కొద్దిగా ముందుకు కదలిన తర్వాత పాలిటెక్నిక్ మీ సేవా వద్దకు చేరుకోగానే ఎంపీ వచ్చి అందులో పాల్గోన్నారు. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా జరిగిన ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్‌లో ఉన్న గ్రూప్ రాజకీయాలు బహిర్గతమయ్యాయి. యెండల, ఎంపీ అర్వింద్ వర్గాలుగా నిజామాబాద్ అర్బన్‌లో జరుగుతున్న రాజకీయం బీజేపీలో ఉన్న విభేధాలు తారాస్థాయికి చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles