Daciots Robbed Seven Hills Express Passengers సెవన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైలుపై బందిపోట్ల దాడి.. భక్తుల నిలువు దోపిడి.!

Seven hills express halted in anantapur robbed by gang

Seven Hills Express, Dacoits Gang, Tirupati, Secundrabad, Railway Protection Force, Turakapalli, Guthi Mandal, Anantapur, Andhra Pradesh, Crime

A gang of robbers on Saturday looted the passengers in Seven Hills Express (Tirupati to Secunderabad) after the train stopped near Turakapalli, Guthi Mandal, Anantapur after the robbers were tampered with the signaling system. According to the reports, a group of robbers entered the S5 and S7 coaches and robbed 90 grams of gold ornaments and cash.

సెవన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైలుపై బందిపోట్ల దాడి.. భక్తుల నిలువు దోపిడి.!

Posted: 04/09/2022 12:45 PM IST
Seven hills express halted in anantapur robbed by gang

ఆనంతపురం జిల్లాలో మరోమారు బందిపోటు దొంగలు రైలు ప్రయాణికులపై స్వైరవిహారం చేశారు. దేశంలో రైలు ప్రయాణాలను సురక్షితం చేస్తూ రైల్వేశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. బందిపోటు దోంగలు మాత్రం వాటిని చేధించుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు బందిపోట్లు రైలు ప్రయాణికులను టార్గెట్ చేయడం దేశంలోని ఏదేని ఒక అనువైన ప్రాంతంలో మాటు వేసి.. దోపిడికి ప్లాన్ చేయడం పరిపాటిగా మారింది. రైలు ప్రయాణాల్లో ఎలాంటి దోపిడీలు జరగకుండా రైల్వే పోలీసులు కూడా గస్తీ కాస్తున్నా.. ఈ దోపిడీలు జరగడం కలకలం రేపుతోంది.

ఈ సారి ఏకంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న వెంకన్న స్వామి భక్తులనే బందిపోటు దోంగలు టార్గెట్ చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైలులోని శ్రీవారి భక్తులను టార్గెట్ చేసిన బంధిపోట్లు.. వారిని తమ చేతుల్లోని ఆయుధాలతో బెదిరించి మహిళలు, పురుషుల మెడలోంచి బంగారు ఆభరణాలతో పాటు.. భక్తులు జేబుల్లోంచి నగదును కూడా లాక్కున్నారు. శుక్రవారం అర్థరాత్రి అనంతపురం జిల్లాలో ఈ భారీ దోపిడికి బందిపోట్లు పాల్పడ్డారు. జిల్లాలోని గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్ తీగలను కత్తిరించిన దొంగలు ఈ దోపిడికి పాల్పడ్డారు.

సిగ్నల్ లేకపోవడంతో తరుకపల్లి రైల్లే స్టేషన్ కు కొంత దూరంలో సెవెన్ హిల్స్ రైలును లోకోపైలెట్ నిలిపివేశారు. దీంతో అప్పటికే అక్కడ మాటువేసిన బంధిపోట్లు వెంటనే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపి ప్రయాణికులను భయపెట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనలో దుండగులు ఎంతమేర దోచుకెళ్లారన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. కానీ.. ఆరు తులాల నగలు, పెద్దమొత్తంలో నగదు దోచుకున్నట్లు సమాచారం. దోపిడీ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలించారు. అప్పటికే వారు పరారవ్వడంతో.. రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles