Missing case of an inter-student turns out to be murder మద్యం మత్తులో నిజం.. హత్యకేసులో వీడిన మిస్టరీ

Accused revealed four years old murder case of inter student under influence of alcohol

Sriharsha, Intermediate student, Chagallu, Velivennu, grandfather house, Daravaram, Diwali festival, Rashid, Aditya, Munindra, absconding, Nidadavolu Junior College, old septic tank, Nidadavol railway gate ditch, Nidadavol, West Godavari district, Andhra Pradesh, crime

The young man who went missing four years back in Nidadavol is found to be murdered after the accused revealed the crime in front of his friends under the influence of alcohol. Police have revealed details of the incident that happened in the current (former West Godavari district) East Godavari district. Sriharsha from Chagallu is studying Intermediate in 2018 at a college in Velivennu.

మద్యం మత్తులో సహచరులకు వార్నింగ్.. హత్యకేసులో నిజం కక్కిన నిందితుడు

Posted: 04/06/2022 04:19 PM IST
Accused revealed four years old murder case of inter student under influence of alcohol

నాలుగేళ్ల క్రితం తన తాతయ్య ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్థి కనిపించకుండా పోయిన ఘటన చివరకు విషాదాంతం అయ్యింది. ఇంటర్ విద్యార్థి హత్యకు గురైనట్టు బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన హర్ష(18) అనే యువకుడు 2018 నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై అతని తండ్రి రత్నుకుమార్‌ నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అతని అచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, చివరకు తాగిన మైకంలో హంతకుడు తనతో పెట్టుకోవద్దని స్నేహితులకు వార్నింగ్ ఇవ్వడంతో హత్య వ్యవహారం బయటపడింది.

అసలు జరిగిందేంటీ.. చాగల్లుకు చెందిన ఇంటర్ విద్యార్ధి హర్షకు తన తాతయ్య ఊరు దారవరంలోని ముగ్గురు యువకులతో స్నేహం ఏర్పడింది. క్రికెట్ ఆడే సమయంలో భవన నిర్మాణ కూలీలతో చిగురించిన స్నేహన్ని కల్మషం లేని హర్ష నమ్మాడు. దీంతో 2018లో దీపావళి సెలవులు రాగానే నేరుగా తన తాతయ్య గ్రామం దారవరంకు వెళ్లిన హర్ష.. క్రికెట్ అడేందుకని ఇంట్లోంచి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. అయితే హర్ష తాత ఇచ్చిన సమాచారంతో ఆయన తండ్రి వచ్చి నిడదవోలు పోలీసులకు పిర్యాదు చేయడంతో మిస్పింగ్ కేసు నమోదైంది.

క్రికెట్ ఆటలో ఏర్పడిన విభేదాలతో హర్ష స్నేహితులే అతడ్ని హత్య చేసినట్లు తాజాగా బయటపడింది. వేలివెన్నులో ఇంటర్‌ చదువుతున్న హర్ష దీపావళి సెలవకు దారవరంలోని తాత శ్యాంసన్‌ ఇంటికి హర్ష వెళ్లాడు. ఆ సమయంలో నిడదవోలు జూనియర్‌ కాలేజీలో క్రికెట్‌ ఆడేందుకు పాత స్నేహితులైన షేక్ రషీద్, ఆదిత్య, మునీంద్రలతో కలిసి వెళ్లాడు. ఆటలో ఏర్పడిన తగదాలతో ముగ్గురు కలిసి హర్షను మెడకు తాడు బిగించి చంపేశారు. తర్వాత శవాన్ని కాలేజీలో వినియోగంలో లేని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. ఆ తరువాత గత ఏడాది దానిని బయటకు తీసి నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాల్వలో పడేశారు.

నాలుగేళ్లుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఇటీవల మద్యం మత్తులో రషీద్ తన మిత్రులకు వార్నింగ్ ఇచ్చాడు. తనతో జాగ్రత్తగా ఉండాలని., అవసరమైతే హతమరుస్తానంటూ వారిని బెదిరించాడు. పోలీసులు రషీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో హర్ష మర్డర్ సంగతి బయటపడింది. విషయం తెలిసిన నిందితులు ఆదిత్య., మునీంద్ర పరారయ్యారు. నిడదవోలు జూనియర్‌ కాలేజీ సెప్టిక్ ట్యాంకులో మిగిలిన ఉన్న ఎముకల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటికైనా తిరిగొస్తాడనుకున్న కుమారుడు హత్యకు గురైయ్యాడని తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles