Bholakpur corporator Mohd Ghousuddin Taha arrested బోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్..

Bholakpur corporator arrested for obstructing policemen from performing duty

Ghousudding Taha, MIM Corporator, Bholakpur corporator, Night Patrolling Police, Hyderabad police, Hyderabad commissionerate, MLA Raja Singh, KTR, DGP Mahender Reddy, Hyderabad, Telangana, crime

The Musheerabad police arrested Bholakpur corporator Mohd Ghousuddin for allegedly obstructing policemen from performing their duty and threatening them two days ago. The corporator along with a few local people had stopped the policemen from ensuring closure of shops in Bholakpur area after midnight and allegedly threatened them.

పోలీసుల విధులకు ఆటంకం: బోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్..

Posted: 04/06/2022 03:16 PM IST
Bholakpur corporator arrested for obstructing policemen from performing duty

పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగించినందుకు గాను ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గౌసుద్దీన్ తాహపై పిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. గత అర్థరాత్రి కార్పోరేటర్ గౌసుద్దీన్‌ పోలీసుల పట్ల దురుసగా వ్యవహరించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు ఈ వీడియోలను రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపి మహేందర్ రెడ్డీల కు ట్యాగ్ చేసి.. ఇలాంటివారిపై చర్యలు చేపట్టగలరా.? అని కామెంట్ చేశారు. ఈ వీడియోలపై ట్విటర్‌ వేదికగా స్పందించిన కేటీఆర్‌.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్‌పూర్ కార్పొరేషన్‌ గౌసుద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై సెక్షన్‌ 350, 506 కింద కేసులు నమోదు చేశారు.

కాగా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ పెట్రోలింగ్‌ పోలీసులతో దుర్భాషలాడాడు. రాత్రిపూట హోటళ్లు నడిపేందుకు అనుమతి లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసుల పట్ల కార్పొరేటర్ గౌసుద్దీన్ అనుచితంగా ప్రవర్తించాడు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామని.. ఇటు వైపు రాకూడదని కూడా పోలీసులకు సూచించామని.. అయినా ఎందుకు వచ్చారని నిలదీశాడు. హోటళ్లు రాత్రంతా తెరిచేఉంటాయని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు.

పోలీసుల ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా.. కార్పోరేటర్ సహా అతని వ్యక్తులు బిగ్గరగా అరుస్తుండటంతో అధికారులకు వినబడనీయకుండా అడ్డుతగిలారు. పోలీసులు తమాషాలు చేస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. వచ్చినవాళ్లు డ్యూటీ చేసుకుని వెళ్లిపోవాలంటూ పోలీసులను హెచ్చరించారు. తమ డ్యూటీని తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగా.. ‘‘రూ.100 తీసుకునేవాడివి నాకే ఎదురు చెబుతావా?’’ అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఈ ఘటనపై ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలిస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

ఇక ఇవాళ ఉదయం ఈ ట్వీట్లు చూసిన మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా.. వారిని అవమానించే రీతిలో వ్యవహరించిన ఎంఐఎం కార్పోరేటర్ మహమ్మద్ గౌసుద్దీన్ టాహపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలకు శాంతిభద్రతలను అందించే పోలీసులపై నాయకులే దౌర్జన్యం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమన్న మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ట్విట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్పోరేటర్ ను అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles