Both Skulls Found Are Of Females: Autopsy 15 ఏళ్లుగా మూసివున్న దుకాణం నుంచి మానవ అవయవాలు లభ్యం..

Maharashtra both skulls found are of females says civil surgeon

Human body parts, Skulls, Female, Civil Surgeon, Autopsy report, Nashik, naka policestation, maharashtra anatomy act, Nasik, Maharashtra, Crime

The examination of the human body parts, which were found in a shop in the Mumbai Naka area of Nashik, was carried out at the civil hospital, and it has been found that the two skulls were of females. The civil surgeon has prepared the panchanama report, which mentions that the two skulls that were further divided into two parts each, were of two women and they did not bear any marks of wounds or injuries.

15 ఏళ్లుగా మూసివున్న దుకాణం నుంచి మానవ అవయవాలు లభ్యం..

Posted: 03/29/2022 08:08 PM IST
Maharashtra both skulls found are of females says civil surgeon

మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదిహేనేళ్లుగా మూసివున్న దుకాణ నుంచి పోలీసులు మానవ అవయవాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ దుకాణం నుంచి కొన్ని రోజులుగా దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయగా.. వారి దుకాణం తెరచి చూసి షాక్ కు గురయ్యారు. మహారాష్ట్రలోని నాకా ప్రాంతంలో 15 ఏళ్లుగా మూసివున్న ఓ దుకాణంలో 8 మానవ చెవులు, మెదడు, కళ్లు, ముఖ భాగాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భవనం నేలమాళిగలో ఉన్న ఈ దుకాణం నుంచి దుర్వాసన వస్తుండడంతో భరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తుక్కుతో నిండిపోయిన ఈ దుకాణంలోని రెండు ప్లాస్టిక్ కంటైనర్లను తెరవగా ఇవి బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు ముంబై నాకా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇది హత్య కాకపోవచ్చని భావిస్తున్నారు. మూసివున్న దుకాణం యజమాని ఇద్దరు కుమారులు మెడికల్ విద్యార్థులు కావడంతో వైద్య పరీక్షల కోసం వీటిని తెచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే, వాటిని రసాయనాల్లో ముంచినట్టు కూడా గుర్తించారు.

ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇది హత్యకేసుగా నమోదుచేయాలంటే స్థానికంగా ఎలాంటి మృతదేహాలు లభ్యంకాకపోవడంతో పోలీసులు న్యాయనిపుణలు సలహాలను తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ పౌర్నిమా చౌగులే మాట్లాడుతూ.. నిజానికి అక్కడ మృతదేహం ఉండి ఉంటే హత్యగా భావించేవాళ్లమని కానీ, మొత్తం 8 చెవులను నిపుణులు కానీ, లేదంటే ఇదే పనిలో కొనసాగుతున్న వారు కానీ కత్తిరించినట్టు ఉండడంతో అది హత్య కాదని నిర్ధారించినట్టు చెప్పారు. అయితే, ఈ విషయమై తనకేమీ తెలియదని షాపు యజమాని పోలీసులకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles