new technique to try eating sugarcane చెరుకు ముక్కల్ని తిన్నాక.. పిప్పిని పడేస్తున్నారా.?

Did you try new technique to eat sugarcane this summer

man eating sugarcane, Man new techinque to eat sugarcane, man technique to eat sugarcane, sugarcane waste, man using plastic bag, man throws sugarcane waste, viral video, video viral

This Man's video is viral online as he eats sugarcane and throws the residue into a carry bag which both ends are hanged to his ears. He chews the sugar cane catching it in hand and then he throws waste in to the bag.

ITEMVIDEOS: చెరుకు ముక్కల్ని తిన్నాక.. పిప్పిని పడేస్తున్నారా.?

Posted: 03/29/2022 03:09 PM IST
Did you try new technique to eat sugarcane this summer

సోషల్‌ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. ఇక కొందరు మాత్రం సోషల్ మీడియా వేదిక ఉన్నదే తమకోసమంటూ నిత్యం నూతనంగా కొత్త కొత్త వీడియోలు సృష్టిస్తూ పోస్టు చేస్తుంటారు. దీంతో సామాజిక వేదికలపైన నిరంతరం రకరకాల వీడియోలు, మీమ్స్‌ సందడి చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నవ్వులు పూయిస్తోంది. వేసవిలో అందుబాటులోకి వచ్చే సీజనల్ పండ్లకు తోడు చెరుకు గడలు కూడా అందుబాటులోకి వస్తుంటాయి. అయితే వాటిని చాలా మంది ఇష్టపడుతున్నా.. తినడం కన్నా తాగడానికే ఇష్టపడుతుంటారు. ఎందకంటే వాటని తినడం పెద్ద కష్టంతో కూడాకున్న పని అని వీరి భావన.

ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన ఓ వీడీయో తెగ వైరల్ చే్స్తోంది. ఓ వ్యక్తి చేతిలో చురుకుగడను పట్టుకుని తింటూ ఓ గ్రౌండ్ లో తిరుగుతుంటాడు. అయితే అతని చుట్టూ చిన్నారి పిల్లలు చేరి అతడ్ని గేలి చేయడం కనిపిస్తోంది. అయ్యో చెరుకుగడల కోసమేమో అన్న మీ సందేహం వచ్చిందా..? కాదండీ ఎందుకంటే అతడు చేసిన పని చిన్నారులకు కూడా మతిపోగొడుతోంది. మూతికి ప్లాస్టిక్‌ కవర్‌ కట్టుకుని మరీ చెరకు ముక్కల్ని ఒక వ్యక్తి వెరైటీగా తింటున్న వైనం నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఈ సమ్మర్‌లో బ్రాండ్‌ న్యూ  టెక్నిక్‌ అంటూ   ఫిదా అవుతున్నారు.

సాధారణంగా చెరుకు తినాలంటే ఒక టెక్నిక్‌  ఉండాలి. ఒడుపుగా పైనున్న తోలు తీస్తూ, ముక్కలు కొరికి తినాలి. అలా   ఆ జ్యూస్‌ మింగుతూ  ఉంటే వచ్చే ఆ  కిక్కే వేరు. ఆ తరువాత ఆ పిప్పిని ఉమ్మడం  కూడా పెద్ద  పనే అయినా, పళ్లకు చక్కటి  ఎక్స్‌ర్‌ సైజ్‌.  అయితే చెరుకును  తినాలంటే పళ్లకు మాంచి బలం ఉండాలి మరి. కాగా  సమ్మర్‌ వచ్చిందంటే చాలు  అందరం చల్లని పానీయాలకోసం తెగ ఆరాటపడతాం. ముఖ్యంగా  వేడిని  తట్టుకునేందుకు, దాహార్తిని తీర్చుకునేందకు  నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లను  ఎక్కువగా తాగుతాం. అలాగే ఈ వేసవిలో  విరివిగా లభించే చెరుకు రసం సమ్మర్‌లో మంచి  రిఫ్రెష్‌మెంట్‌ ఇస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles