Octogenarian spends night in bank due to staff's negligence బ్యాంకు లాకర్ రూమ్ లో 89ఏళ్ల వద్దుడు.. 18 గంటలు అక్కడే..!

89 year old goes missing in hyderabad found stuck in bank locker room after 18 hours

Senior citizen, 89 years old locked in locker, Elderly man locked up in locker room, Senior citizen locked in Union Bank, Union Bank locks Octogenarian in locker room, Union bank of india, Locker room, Locker, Missing person, Negligence, Jubilee hills, Hyderabad, Telangana, crime

An 89-year-old man had to spend a night in a bank’s locker room here due to the negligence of the bank staff. The man had to spend 18 hours in the bank after the staff locked the premises and left on Monday. The shocking incident occurred in Union Bank of India’s branch in posh Jubilee Hills area and came to light on Tuesday after police traced and rescued him.

బ్యాంకు లాకర్ రూమ్ లో 89ఏళ్ల వద్దుడు.. 18 గంటలు అక్కడే..!

Posted: 03/29/2022 01:38 PM IST
89 year old goes missing in hyderabad found stuck in bank locker room after 18 hours

ఓ వైపు బ్యాంకు ఉద్యోగసంఘాలు తమ డిమాండ్లను నెరవేర్చాలన్న డిమాండ్ తో ఏకంగా 48 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే అది తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. తెలంగాణలో కార్మిక సంఘాల సమ్మెతో ప్రభావితం కాకుండా బ్యాంకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేసినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో తెలంగాణలోని ఓ బ్యాంకు నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలమీదకు తీసుకువచ్చింది. బ్యాంకు లాకర్​ గదిలోకి వెళ్లిన 89 ఏళ్ల వృద్ధుడు.. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా అందోళనకు గురయ్యారు.

జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం తాజాగా బయటపడింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 89ఏళ్ల పెద్దాయన రాత్రంతా ఏకంగా 17 గంటల పాటు లాకర్ గదిలో బంధీగా ఉండాల్సివచ్చింది. ఓ వైపు మధుమేం, మరోవైపు రక్తపోటుతో బాధపడుతున్న పెద్దాయనను బ్యాంకు సిబ్బంది తీవ్ర మనస్థాపానికి గురిచేశారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు. అయితే ఆ వయస్సులో ఉన్న ఆయన ఏమాత్రం అందోళన చెందిన పరిస్థితి మరోలా ఉండేది. కానీ ధైర్యాన్ని ఓడి ఉండటంతో పాటు ఆయనకు బయటకు వచ్చే వరకు జీవవాయువు కూడా అందటం మరో అంశం.

ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 67లో నివసించే కృష్ణారెడ్డి (89) తనకు అవసరమెచ్చి సరిగ్గా నిన్న సాయంత్రం 4.20 నిమిషాలకు బ్యాంకుకు చేరకున్నారు. ఆయన తన లాకర్ కోసం లాకర్ రూమ్ లోకి వెళ్లిన తరువాత బ్యాంకు సిబ్బంది తమ సమయం అయ్యిందని బ్యాంకును క్లోజ్ చేసుకుని వెళ్లిపోయారు. అయితే బ్యాంకులో ఎవరైనా వున్నారా.? లేదా.? అన్నది మాత్రం పట్టించుకోలేదు. దీంతో బ్యాంక్‌ లాకర్ గదిలోకి వెళ్లిన వృద్ధుడు కృష్ణారెడ్డిని.. గమనించకుండా సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడంతో ఆయన దాదాపుగా 17 గంటల పాటు ఆ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

అయితే కృష్ణారెడ్డి కుటుంభసభ్యులు ఆయన చీకటిపడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో అందోళన చెందారు. బ్యాంకుకు ఇంటికి పలుమార్లు చెక్కర్లు కోట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు చూసి బ్యాంకు లాకర్ గదిలో ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్​ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకుని వచ్చారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కెర వ్యాధి, రక్తపోటు సమస్యలతో కృష్ణారెడ్డి బాధపడుతున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles