zomato: Cops Frown At 10-min Food Delivery ‘జొమోటో’.. 10 నిమిషాల యాడ్ పై పోలీసుల నోటీసులు..

Tamil nadu police issues notice to zomato for 10min delivery

Zomato’s 10-minute food delivery plan, social media storm, Chennai City Traffic Police, violation of traffic rules on roads to meet deadline, Police commissioner Shankar Jiwal, Zomato representatives, zomato, Company representatives, food delivery app, shankar jiwal, social media, zomato employees, chennai, Tamil Nadu, Crime

Zomato’s 10-minute food delivery plan has whipped up a social media storm that has prompted the city police to seek an explanation from the popular food delivery app. Many have raised concerns over the safety of food delivery personnel involved and how they could violate traffic rules in their rush to meet the deadline.

కొత్తగా అలోచించి.. బుకైన ‘జొమోటో’.. 10 నిమిషాల యాడ్ పై నోటీసులు..

Posted: 03/25/2022 07:17 PM IST
Tamil nadu police issues notice to zomato for 10min delivery

ఒక్కోసారి కొత్తగా అలోచించి.. అందులోని లాజిక్ తో తమ కస్టమర్లను ఆకర్షించాలని భావించే సంస్థలు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా అలోచించడంలో తప్పు లేదు కానీ కొత్తదనం పేరుతో తమ సంస్థలోని ఉద్యోగుల ప్రాణాల మీదకు తీసుకువస్తే.. అది ప్రమాదన్న విషయాన్ని మర్చిపోవడమే కష్టాలకు కారణం అవుతోంది. తాజాగా ఫుడ్ డెలివరీ రంగంలో దూసుకుపోతున్న జుమోటో కూడా ఇలాంటి కష్టాలనే ఎదర్కోంటోంది. ఈ సంస్థ తాజాగా జారీ చేసిన ప్రకటన పోలీసులను కన్నెర చేసేలా చేసింది. నిత్యం రద్దీగా ఉండే తమ రోడ్లపై జోమాటో సిబ్బంది కష్టాలపై పోలీసులు అలోచించారు. అంతే నోటీసులు ఇచ్చారు.

తమ యాప్ ద్వారా ఆహారం బుక్ చేస్తే కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ చేసిన పుడ్ ను అందిస్తామని ఇచ్చిన ప్రకటనపై పోలీసులు మండిపడ్డుతున్నారుకన్నెర్ర చేశారు. ఆర్డర్‌ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలవరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే ఆహార పదార్థాలను జుమోటో ప్రతినిధులు ఇళ్లు, కార్యాలయాలు అంటూ ఎక్కడికైనా సరే తీసుకెళ్లి అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వినియోగదారుడికి మరింత చేరువయ్యే విధంగా ఆర్డర్‌ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రకటనను జుమోటో వర్గాలు తాజాగా చేశాయి.

దీంతో కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారో..? అనే చర్చ బయలుదేరింది. చెన్నై వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న సంకేతాలు కూడా వినిపించాయి. పది నిమిషాల్లో వినియోగ దారుడికి ఆహార పదార్థాలు అందించాల్సి ఉండటంతో, ఆ ప్రతినిధులు తమ వాహనాల్లో అతివేగంగా దూసుకెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ట్రాఫిక్‌ నిబంధనల్ని అతిక్రమించక తప్పదు. దీనిని పరిగణించిన చెన్నై ట్రాఫిక్‌ పోలీసు వర్గాలు జుమోటోకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్‌ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles