'అతివిశ్వాసం వద్దు... బొక్కబోర్లా పడొద్దు.. ఎమ్మెల్యేలు సుప్రీం అనుకోవద్దు.. అందరి చిట్టా నాదగ్గర ఉంది.. ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలి... ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి' అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్వేలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుసరించే ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ భవన్లో సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. వారికి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంలోని కులవృత్తులందరితో సహపంక్తి భోజనం చేయాలని, ఆదునిక సాంకేతికతను వివరించాలన్నారు.
కేంద్రం అనుసరిస్తున్నవిధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగాది తర్వాత ఏప్రిల్ 8లోపు ఢిల్లీలో కేసీఆర్ ధర్నా నిర్వహించే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మత చాందస్సా వాదులను దేశం నుంచి తరమి కొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కూడా రానివొద్దని అన్నారు. ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలని పిలుపు నిచ్చారు. రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు ఏదోరకంగా నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి చోటా సర్వే రిపోర్టులు వస్తున్నాయని, ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మారాలన్నారు. రాని వారి స్థానాలు మారుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరాగాంధీ సైతం 1971లో ఎదురే లేదని అతివిశ్వాసంతో పోతే మళ్లీ ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం సెంటిమెంట్ రాజకీయం చేస్తోందని దానిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. అదే విధంగా విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేవరకు కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించారు.
23న నియోజకవర్గాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఈ నెల 26న గ్రామ పంచాయతీలు, 27న మండల ప్రజా పరిషత్, 30న జిల్లా పరిషత్ లు కేంద్ర రైతు వ్యతిరేక విధానాలు, వైఖరికి నిరసనగా తీర్మాణాలు చేయనున్నారు. 28న యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి పిడికెడు బియ్యాన్ని సేకరించి ప్రధాని మోడీకి పంపించేందుకు కార్యచరణ చేపట్టారు.
అదే విధంగా అన్ని యూనివర్సిటీ, కళాశాలల్లో విద్యార్థి సంఘాలతో టీఆర్ఎస్వీ నేతలు లీడ్ తీసుకొని బీజేపీ విధానాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించనున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి మంచి అభిప్రాయం ఉందని, కానీ ప్రతి రోజూపార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత స్తబ్దత ఉందని అది పోవాలని, కష్టపడి పనిచేయాలని సూచించారు. అన్ని కేసీఆర్ చూసుకుంటారనేది పోవాలన్నారు. ఓన్లీ ఫేస్ ఆఫ్ కేసీఆర్ అనే భావన పోవాలని అందుకుకష్టపడి పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
అదే సందర్భంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని.. ఈ ఊహాగానాలు చేస్తున్నవారు మతితప్పిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏకంగా 95 నుంచి 105 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. బీజేపి మతోన్మాదాన్ని రెచ్చగోట్టి.. హిందూ ఓట్లకు గాలం వేస్తోందని అరోపించిన ఆయన.. కాశ్మీర్ పండిట్ల కోసం గత ఏడున్నరేళ్లుగా బీజేపి ఎందుకు ఏమీ చేయలేదని ప్రశ్నించారు. కేవలం సినిమాను ప్రోత్సహించడం ద్వారా వారికి న్యాయం జరగదని.. వారు పండిట్లకు న్యాయం చేస్తామంటే ఎవరు అడ్డుకున్నారని కేసీఆర్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more