ఎక్కడ వున్నా ఏమైనా.. మనం ఎవరికి వారై వేరైనా.. నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వీడి అందుకే వెళ్తున్నా.. అంటూ పాత చిత్రాల్లో ప్రేమ చిగురించి.. పెళ్లిగా మారకుండా వారికి వేరే వారితో పెళ్లి జరుగుతుండగా వచ్చే పాటలు. అయితే అక్కడి నుంచి 1980లకు వచ్చేసరికి తన ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని మాజీ ప్రియులు ఏకంగా పెళ్లి మండపానికి వచ్చి.. ఈ పెళ్లిని అపండీ.. అనే డైలాగులు చాలా వినిపించాయి. అయితే ఇప్పుడు జనరేషన్ మారింది. 2022లోనూ 1980 నాటి చిత్రాలు ఎలా హిట్ అవుతున్నాయో కూడా తెలిసిందే. రంగస్థలం, పుష్ఫ లాంటి చిత్రాలు ఇప్పటికే నిరూపించాయి. ఏమీటీ ఒకదానికోకటి సంబంధం లేకుండా.?
అక్కడికే వస్తున్నాం. 2022లోనూ 1980 చిత్రాల తరహాలో ఓ మాజీ ప్రియుడు తన ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించి.. తన భాధను వెళ్లగక్కడాడు. అయితే తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకో.. వారు చస్తామన్న బెదిరింపులకో గురై.. భాధను లోలోపల ఎంత బాధ వున్నా పైకి మాత్రం నీవెవరో కూడా నాకు తెలియదు అన్న డైలాగ్ పెళ్లి కూతురు చెప్పడం పరిపాటే. మరి ఇక్కడేం జరిగింది. పెళ్లి కూతరు నిజంగానే అతడి మాజీ ప్రియురాలా.? లేక ప్రియుడుగా చెప్పుకనే వ్యక్తిది వన్ సైడ్ లవ్.? అన్నది మాత్రం తెలియదు. కానీ ఇక్కడ ఈ పెళ్లి కూతురు సినిమాల్లో హీరోయిన్ చెప్పిన డైలాగ్ నే చెప్పడం కొసమెరుపు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. దండలు మార్చుకునే తంతును పూజారి నిర్వహిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ కళ్యాణ్ మండపం దగ్గరికి వచ్చాడు. వైట్ షర్ట్ వేసుకొని వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. పెళ్లి కూతురు మాజీ లవర్ అని అక్కడున్న బంధువులకు తర్వాత తెలిసింది. అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి అచ్చం సినిమాల్లో జరిగినట్టు పెళ్లి కొడుకు ముందే పెళ్లి కూతురును తాను ఎంత ప్రేమిస్తున్నాడో అందరికీ చెప్పాడు.
ఈ సమాజం ఏమనుకుంటుందో అని నువ్వు భయపడకు. ఎందుకంటే నేను నిన్న నిజంగా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాజల్ అంటూ బాధపడ్డాడు. ఆ తర్వాత నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఇక్కడ ఉన్న అందరికీ చెప్పు అంటూ పెళ్లికూతురును కోరాడు. అతడు.. పెళ్లి మండపం మీదికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటే.. పెళ్లికొడుకుతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు సినిమా చూస్తున్నట్టుగా ఉండిపోయారు. కట్ చేస్తే అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ప్రేమ తర్వాత అసలు ముందు నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటూ పెళ్లికూతురు అనడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more