Passengers Push Train Away From Burning Engine రైలు బోగీలను నెట్టుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..

Fire engulfs two train coaches near meerut passengers push to separate rest

Train Fire News, Train Fire, daurala, saharanpur, delhi, Saharanpur-Delhi train, Saharanpur-Delhi passenger train, railways, Indian railways, trains in India, Passengers Train Fire, Saharanpur-Delhi train, passenger, fire, meerut, Uttar Pradesh, viral video

A fire broke out in the engine and two coaches of the Saharanpur-Delhi passenger train today during its halt at the Daurala station in Meerut district of Uttar Pradesh. In a video on Twitter, passengers were seen pushing the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out.

ITEMVIDEOS: బోగీలను నెట్టుకుంటూ వెళ్లి.. రైల్వే ఆస్తులను కాపాడిన ప్రయాణికులు..

Posted: 03/05/2022 03:42 PM IST
Fire engulfs two train coaches near meerut passengers push to separate rest

ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో బైకులు, స్కూటర్లు అర్ధంతరంగా ఆగిపోయాయా.? అలాంటప్పుడు ఏం చేస్తాం.? ఈ మధ్యకాలంలో కాసింత అధునాతన టెక్నాలజీ జోడించి కార్లు తయారు చేస్తున్నారు. అంతకుముందు కార్లు కూడా మార్గమధ్యంలో అగిపోయేవి.. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు.? బైకులు, స్కూటర్లు అయితే కాసింత అటు ఇటు వంచి ఆ తరువాత లేపి స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అప్పటికీ స్టార్ట్ కాకపోతే.. వాటిని తోసుకుంటూ స్టార్ట్ చేసేవాళ్లు. కార్లనే కాదు ఆఖరికి బస్సులు, లారీలను కూడా మార్గమధ్యంలో అగిపోతే ఇలానే తోసి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించేవాళ్లు.

అచ్చం ఇలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రవాణా సాధనాన్ని నెట్టుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది ఏ రవాణ సాధనం అంటారా.. అదే దూమశకటం.. పోగబండి.. బోధపడలేదా.. అదేనండీ రైలుబండి. వామ్మో.. రైలును నెట్టుకుంటూ ప్రారంభించేందుకు ప్రయత్నించారా.? అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఇంజిన్ నుంచి ఆ బోగీలను వేరు చేయడానికి కష్టపడుతున్నారు. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారనే కదా మీ డౌటు. రైల్వే ఆస్తులను కాపాడటానికి వీరు కష్టపడ్డారు. రైల్వే ఆస్తులకు వచ్చిన నష్టమేమిటీ అంటారా.?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ వెళ్లడానికి వీరు ఎక్కిన రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఆ రైలు ఇంజిన్, మరో రెండు కంపార్ట్‌మెంట్లలో మంటలు వ్యాపించాయి. వాటిని చూసి రైలు దిగేసిన ప్యాసింజర్లు.. రైల్వేకు నష్టం కలగకుండా సాయం చేయాలని అనుకున్నారు. అంతే మంటలు మండుతున్న ఇంజిన్, కంపార్ట్‌మెంట్లను వదిలేసి మిగతా బోగీలను దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ప్రమాదం షహరాన్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే రైల్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మంటలు ఎందుకు ప్రారంభమైందీ తెలియడం లేదని, అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని భారతీయ రైల్వే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వై.కె. ఝా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles