CBI raises doubts over authenticity of YS Viveka 'note' వైఎస్ వివేకా రాసిన లేఖపై ఫోరెన్సిక్ నివేదిక.. సంచలన విషయాలు

Cbi raises doubts over authenticity of note purportedly written by late ys vivekananda reddy

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Narreddy Rajasekhar Reddy, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Y.S. Avinash Reddy, YCP state secretary, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, TDP MLC BTech Ravi, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The CFSL said that forensic analysis of the note, which has been sent by the CBI officials to the court, revealed that the handwriting in it showed a lack of coordination between the pen and brain. The CFSL report further revealed that the note has been written amid extreme physical strain, and that the person must have been coerced into writing the note.

వైఎస్ వివేకా రాసిన లేఖపై ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు

Posted: 03/03/2022 11:07 AM IST
Cbi raises doubts over authenticity of note purportedly written by late ys vivekananda reddy

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును చేపట్టిన సిబీఐ.. తమ విచారణను అన్ని కోణాల్లో వేగం చేసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్యకు గురైనప్పుడు ఆయన రాసిన లేక.. వెలుగుచూసిన లేఖపై కూడా సీబిఐ విచారణ జరిపింది. ఇందుకోసం ఆయన ఏలాంటి సందర్భంలో లేఖను రాశారన్న విషయాన్ని సిబిఐ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ద్వారా తెలుసుకున్నారు. వైఎస్ వివేకాపై దాడికి పాల్పడుతూ.. ఆయనను కొడుతూ.. ఆయన అభిష్టానికి విరుద్దంగా ఈ లేఖ రాయించినట్టు ఉందని సీబిఐ పేర్కోంది. వైఎస్ వివేకాపై ఒత్తిడి తీసుకువచ్చి.. బలవంతంగా రాయించినట్టు ఫోరెన్సిన్ నిపుణులు ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోందని సీబిఐ కోర్టులో ఆ నివేదికను సమర్పించింది.

తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని న్యాయస్థానానికి సిబిఐ వివరించింది. అందుకే చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్సు ప్రయోగశాలలో సైకలాజికల్‌ విశ్లేషణ చేయించిన సీబీఐ అధికారులు ఆ సంస్థ జారీ చేసిన నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఇటీవల దాఖలుచేసిన అభియోగపత్రంతో పాటు ఆ నివేదికనూ న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది. ఈ లేఖ రాసే సమయంలో ఆయన మెదడుకు పెన్నుకూ మధ్య సమన్వయం లేదని.. బలవంతంగా రాసినట్లు, తీవ్ర ఒత్తిడి, బలవంతం మధ్య ఇది జరిగినట్లు ఉందని తెలిపింది.

ఈ కారణంగా రాసే సమయంలో ఆయన చేయి వణుకిందని కూడా నివేదికలో స్పష్టమైందని, దీని ఫలితంగానే లేఖలో అక్షరాలు కూడా క్రమపద్దతిలో లేవని అన్నారు. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కోచోట ఒక్కోలా ఉంది. పదాలు, వరుసల మధ్య పొంతన లేదు. అక్షరాలు కొన్నిచోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయి. వివేకానందరెడ్డి అసలైన సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉంది. ఆయన తన సంతకంలో తొలుత ఇంటిపేరు చేర్చి వై.ఎస్‌.వివేకానందరెడ్డి అని పెడతారు. కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే.. అదీ అస్పష్టంగా ఉంది. స్పృహ లేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని నివేదిక వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles