సుమారు 15 ఏండ్లు హిందువుగా అందరినీ నమ్మించిన బంగ్లాదేశ్ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు మూడు నెలలపాటు వెతికిన పోలీసులు చివరకు 27 ఏండ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన రోనీ బేగం, 12 ఏండ్ల వయసులో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. పాయల్ ఘోష్‌గా పేరు మార్చుకున్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతిగా పేర్కొంటూ కొంతకాలం ముంబైలోని బార్లో డ్యాన్సర్‌గా పనిచేసింది. ఈ సమయంలో మంగళూరుకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితిన్ కుమార్‌ను ప్రేమించి పెండ్లి చేసుకున్నది.
పెండ్లి తర్వాత ఈ జంట 2019లో బెంగళూరులోని అంజననగర్లో స్థిరపడింది. హిందువుగా చెప్పుకుంటున్న ఆ మహిళ టైలర్‌గా పనిచేస్తున్నది. కాగా, ముంబైలో ఉన్న సమయంలోనే ఈ జంట పాన్ కార్డులను సమకూర్చుకున్నది. తర్వాత బెంగళూరులోని నితిన్ స్నేహితుడి సహాయంతో ఆధార్ కార్డులు పొందారు. అయితే, రోనీ బేగం తండ్రి మూడు నెలల కిందట మరణించారు. దీంతో తండ్రిని కడసారి చూసేందుకు, అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని ఆమె భావించింది. దీని కోసం తొలుత కోల్‌కతా వెళ్లింది. అక్కడి నుంచి ఢాకా వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె పాస్‌పోర్ట్‌పై ఇమిగ్రేషన్ అధికారులకు అనుమానం కలిగింది. ఆ మహిళను ప్రశ్నించగా అక్రమంగా భారత్‌కు వలసవచ్చినట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ వెంటనే బెంగళూరుకు తిరిగి వచ్చింది.
మరోవైపు, విదేశీ ప్రాంతీయ నమోదు కార్యాలయం నుంచి ఆ మహిళ సమాచారం బెంగళూరు పోలీసులకు అందింది. దీంతో బ్యాదరహళ్లి పోలీసులు అక్రమ చొరబాటు కింద కేసు నమోదు చేశారు. మూడు నెలలుగా ఆ మహిళ కోసం వెతికారు. చివరకు బెంగళూరు శివారులో ఉంటున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఆమె భర్త నితిన్ పరారీలో ఉన్నాడు. కాగా, అక్రమంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు పొందేందుకు ఈ జంటకు సహకరించిన వ్యక్తులను గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ మహిళ అక్రమ వలసకు సహకరించిన నిందితులను అరెస్ట్ చేసేందుకు కోల్‌కతా, ముంబైతోపాటు ఇతర నగరాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more