Regular market approval granted for Covishield, Covaxin మెడికల్ షాపుల్లో లభ్యం కానున్న కరోనా వాక్సీన్లు..

Dcgi grants conditional market approval for covishield covaxin

covaxin covishield market price, covaxin, covishield, order covaxin covishield, covaxin market price, covishield market pric, market approval, covaxin covishield market approval, what does market approval mean, coronavirus, corona, Covishield, Covaxin, Health ministry, India, coronavirus vaccine, Covishield, Covaxin

Covaxin and Covishield will now be available in the regular market as the Drug Controller General of India has given conditional market approval to these two Covid vaccines. The subject expert committee of the Central Drug Standard Control Organisation has earlier recommended granting regular market approval to these Covid-19 vaccines for the adult population, subject to certain conditions.

మెడికల్ షాపుల్లో లభ్యం కానున్న కరోనా వాక్సీన్లు.. డీజీసిఐ అనుమతి

Posted: 01/27/2022 07:54 PM IST
Dcgi grants conditional market approval for covishield covaxin

కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్న ప్రజలకు రెండవ దశకు ముందు అందుబాటులోకి వచ్చిన కరోనా వాక్సీన్ అడ్డుకట్ట వేస్తుందన్నది తెలిసిన విషయమే. అయితే ఈ వాక్సీన్లను తయారు చేస్తున్న సంస్థలు పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయలేదని అందువల్ల రెండో దశలో తీవ్ర ప్రభావం చూపిన కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ నేపథ్యంలో అటు ఆక్సిజన్ అందుబాటు లేక, ఇటు రెమిడెసివీర్ మందు లభ్యంకాక మరోవైపు వాక్సీన్ కూడా అందుబాటులో లేకపోవడంతో పలువురు మృత్యువాత పడిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన కేంద్రం.. మెరుపు వేగంతో కరోనా వాక్సీన్ తయారు చేయించి మూడు నెలల వ్యవధిలో పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చింది.

ఇక వాక్సీన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతీఒక్కరు ఈ వాక్సీన్ తీసుకునేలా పలు పథకాలతో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలుతు దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వాక్సీన్లను మాత్రమే దేశప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం.. ఆ తరువాత పలు విదేశీ వాక్సీన్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టకు వేయగలిగింది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జారీ చేసింది. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో ఫార్మా సంస్థలు టీకాల ధరలను నిర్ణయించనున్నాయి.

సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉండగా, దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200, కొవిషీల్డ్‌ ధర రూ.780 గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9న నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా,భారత్ బయోటెక్ సంస్థలు ప్రభుత్వానికి అందజేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  corona  Covishield  Covaxin  Health ministry  India  coronavirus vaccine  Covishield  Covaxin  DGCI  Market  Hospital  Clinics  MRP  

Other Articles