సామాజిక మాద్యమం ట్విట్టర్ సంస్థ పూర్తిగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం చెక్కుచేతల్లోకి వెళ్లిపోయిందని.. ఇందులో బాగంగా ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీలపై ఆ సంస్థ శీతకన్ను వేసి.. వారి స్థాయిని తగ్గించే విధంగా చర్యలకు పూనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తన ఫాలోవర్స్‌ను ఆ సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వత్తడి చేయడం వల్ల తన స్వరాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు లేఖ కూడా రాశారు. మోదీ సర్కార్ వత్తడి చేయడం వల్ల ట్విట్టర్ తన ఫాలోవర్లను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ లేఖలో రాహుల్ పేర్కొన్నారు.
ఇటీవల రాహుల్ చేసిన ఓ ట్వీట్‌ను కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో భావ స్వేచ్ఛను ట్విట్టర్ నియంత్రిస్తున్నట్లు రాహుల్ తన లేఖలో సీఈవో పరాగ్‌కు తెలిపారు. ప్రస్తుతం రాహుల్‌కు ట్విట్టర్లో 19.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో 8 రోజుల పాటు రాహుల్ ట్విట్టర్ సస్పెండ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి రాహుల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్యం క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విట్టర్ సంస్థ స్పందించింది. రాహుల్ గాంధీ లెటర్‌కు కౌంటర్ ఇచ్చిన ట్విట్టర్.. ఫాలోవర్ కౌంట్ అనేది విజిబుల్ ఫీచర్ అని, నెంబర్ల విషయంలో నమ్మకం ఉండాలని, అవన్నీ వాస్తవ సంఖ్యలే అని సోషల్ మీడియా సంస్థ తెలిపింది.
తన ట్విట్టర్ ద్వారా రిప్లై ఇస్తూ.. తమ ప్లాట్ఫామ్లో ఎటువంటి అవకతవకలు జరగవని, జీరో టాలరెన్స్ ఉంటుందని, స్పామ్ ఉండదని పేర్కొన్నది. తమ ప్లాట్ఫామ్లో అవకతవకలకు పాల్పడే వారికి చెందిన మిలియన్ల అకౌంట్లను ప్రతి వారం డిలీట్ చేస్తూనే ఉంటామని ట్విట్టర్ చెప్పింది. ట్విట్టర్ ట్రాన్స్పరెన్సీ సెంటర్లో దానికి సంబంధించి అప్డేట్ చూసుకోవచ్చు అని సూచించింది. కొన్ని అకౌంట్లలో మాత్రం స్వల్ప తేడాను గమనించవచ్చు అని ట్విట్టర్ తెలిపింది. స్పామ్, ఆటోమేషన్ పొరపాట్లను వ్యూహాత్మకంగా డీల్ చేయనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. దీర్ఘకాలంలో ఫాలోవర్ల కౌంట్ అనేది ఒడిదిడుకులకు లోనవుతుందని ట్విట్టర్ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
May 25 | అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పులు దద్దరిల్లాయి. అందులోనూ అగ్రరాజ్య విద్యార్థులు విద్యను అభ్యసించే పాఠశాలల్లో కాల్పుల మోత మ్రోగగం గమనార్హం. ఈ సారి అమెరికాలోని టెక్సాస్‌లో తుపాకి గుళ్ల మోతతో పాటుగా విద్యార్థులు,... Read more
May 24 | ప్రతీ మగవాడి జీవితంలోనూ మౌనంగా వెనకాలే ఉంటూ ముందుకునడిపే స్త్రీమూర్తి ఉంటుంది. అమె ధర్మపత్ని. ఆ జీవిత భాగస్వామి కోసం ఎవరైనా ఏమైనా చేశారా.? అంటే మీనవేషాలు లెక్కించేవారి సంఖ్యే ఎక్కువ. కానీ ఇక్కడ... Read more
May 24 | అడవికి రారాజు సింహం. బోనులో ఉన్నాంత మాత్రన దాని జూలు పట్టుకుని ఆడతామంటే.. కుదరదు. ఎక్కడున్నా మృగరాజు.. మృగరాజే. బోనులో ఉంది కదా.. అని దానిని సరదా అడపట్టించేందుకు ప్రయత్నించిగా.. అది కూడా దాని... Read more
May 24 | కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆందోళనకు దారితీసింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంపై నిరసన మెుదలైంది. దీంతో జిల్లాలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. గతంలో జిల్లాకు పేరు పెట్టాలని ఉద్యమం... Read more
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more