సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఎంతో వేగంగా పనులు చక్కబెట్టుకుంటున్నామని సంబరపడిపోతున్నాం. అయితే అదే వేగంతో అవతలివారి మాయలో పడతే మాత్రం నిట్టనిలువునా మునిగిపోతాం. ఎదుటివారిని బుట్టలో దింపి వారిని మోసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్ల వెయి కళ్లతో నిత్యం నిఘా పెడుతూనే వుంటాయి. ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా లేకపోతే ఎంతో కష్టించి సంపాదించిన డబ్బంతా క్షణపాటులో కోల్పోయినవారు అవుతారు. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్లో జరిగింది. బ్రిటెన్ లో ఉద్యోగం కల్పిస్తామంటూ నమ్మించి.. శఠగోపం పెట్టిన సైబర్ నేరగాడి వలలో చిక్కిన నగరవాసి ఏకంగా పదకొండు లక్షల 14 వేల రూపాయలను కోల్పోయాడు.
అన్ లైన్ లో రెజ్యూమ్ అప్ లోడ్ చేయగానే ఇక్కడ జాబులేంటి.. మీ రెజ్యూమ్ చూశాను.. మీ చదవుకు తగ్గ ఉద్యోగం మంచి వేతనం కావాలంటే లండన్ బెటర్. ఇక్కడ వేలలో సంపాదించే కంటే అక్కడ లక్షల్లో సంపాదన అంటూ ఆశపెట్టి మరీ బుట్టలోకి దింపాడు. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవి తాను చూసుకుంటానన్నాడు. ఒప్పుకునే వరకు ఒప్పించేలా చాలా కష్టపడతారు. సర్లే ఊ అన్నావా.. వారి ఉచ్చులో పడ్డటే. ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్ని ఆన్లైన్ పెట్టాడు. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు.
అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు. ఆ తర్వాత తాము చెన్నై ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్ కేర్ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి నగర వాసి అకౌంట్లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more