గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే బీజేపి అవలంబిస్తున్న తాత్సార ధోరణి, నిర్లక్ష్య వైఖరిపై ఆయన పార్టీ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేరచరిత్ర కలిగిన నేతలకు టికెట్టు ఇస్తారా.? అందకనే తనకు టికెట్ ఇవ్వడంపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదా.? అని ఆయన నేరుగా బీజేపి రాష్ట్రాస్థాయి నేతలను టార్గెట్ చేశారు.
ఇదిలావుండగా, ఉత్పల్ పారికర్‌కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణశాఖ మంత్రిగా వ్యవహరించిన మనోహర్ పారికర్ కు నిజమైన నివాళిని అర్పించేందుకు ప్రత్యర్థి పార్టీలకు మంచి అవకాశం లభించిందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. పారికర్ వారసుడైన ఉత్పల్ కు పానాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి పోటీ లేకుండా మద్దతు ఇస్తాయని ఆయన తెలిపారు. ఉత్పల్ పారికర్ కు మద్దతుగా కాంగ్రెస్, ఆప్, తృణమూల్ తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు.
తద్వారా మాజీ సీఎం మనోహర్ పారికర్‌కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు. మరోవైపు ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఉత్పల్ ఆప్‌లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more