పల్నాడు గడ్డపై మరోమారు ప్రత్యర్థి వర్గాల మధ్య పగలు ప్రాణాలు తీసాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన రాజకీయ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురికావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ నేత చంద్రయ్యకు ఆయన రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. చంద్రయ్య ఈ రోజు ఉదయం పని నిమిత్తం బైకుపై బయలుదేరి వెళ్లారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చంద్రయ్య కోసం కాపు కాసిన ప్రత్యర్థులు బైక్‌కు ఓ కర్ర అడ్డుపెట్టడంతో చంద్రయ్య కిందపడిపోయారు.
దీంతో ఆయనపై కత్తులు, కర్రలతో దాడి చేస్తూ విరుచుకుపడడంతో చంద్రయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అనంతరం గుండ్లపాడులో ఉద్రిక్తత నెలకొనడంతో మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులు చేయి దాటిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆధిపత్యపోరే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. అయితే, పోలీసులు చాలా ఆలస్యంగా గ్రామానికి వచ్చారని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయగా, తమ ప్రాంత టీడీపీ నేత బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించరాదని కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో గుండ్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు టీడీపీ నేతలు ఆ గ్రామానికి తరలివెళ్తున్నారు.
టీడీపీ నేత తోట చంద్రయ్యను కొందరు వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై గొంతు కోసి హ్యత చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనలో ఇప్పటికే చాలా మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పల్నాడులోనే పదుల సంఖ్యలో హత్యలు జరిగాయన్నారు. జగన్ పాలనపై తిరగబడుతుండడం వల్లే ప్రజలను భయపెట్టేందుకు వైసీపీ నేతలు ఈ హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేవారికే పదవులను ఇచ్చే విష సంస్కృతికి జగన్ బీజం వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారని, పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీ బరితెగింపులు ఆగేవని అన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more