దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు ఐదువేలకుపైగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ఇప్పటికే అమెరికా, బ్రిటెన్, దక్షిణాప్రికా దేశాల్లో లక్షలాధి మందిని ప్రభావితం చేసింది. ఇక భారత్ లోనూ ఇది ప్రభావం చాటుతోంది. అయితే దీని బారినపడ్డ వారిలో చాలా తక్కువ మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. అనేకులలో లక్షణాలు కనిపంచడం లేదు. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా సోకింది ఈ వేరియంటేనా..? లేక మరోకటా అన్నది తేలిపోనుంది.
అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ అందరు కరోనా పేషంట్ల నమూనాలను పరీక్షించడం సాధ్యం కాని విషయం. దీంతో చాలా వరకు రాష్ట్రాల్లో కేవలం మూడు నుంచి నాలుగు వందల నమూనాలను మాత్రమే పరీక్షలకు పంపుతున్నారు. అయితే వీరి నుంచి సగటును తెలుసుకుని అంచనా మేరకు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ సోకిందీ లేనిది చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో టాటా కంపెనీ శుభవార్త చెప్పింది. వేరియంట్ సోకిందో.. లేదో తెలుసుకునేందుకు టెస్ట్ కిట్ ఒమిష్యూర్ టెస్ట్ కిట్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. ఈ కిట్ ఇవాళ్టి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నది.
ఒమిక్రాన్ టెస్ట్ కిట్ ఒమిసూర్ ను టాటా మెడికల్ తయారు చేసింది. టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ ఒమిక్రాన్ టెస్ట్ కిట్‌ను డిసెంబర్ 30న ఐసీఎంఆర్ ఆమోదించింది. ఒమిష్యూర్ టెస్ట్ కిట్ ఇతర ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్ మాదిరిగానే పని చేస్తుంది. కిట్‌తో పరీక్ష కోసం ముక్కు, నోటి నుంచి సేకరించిన నమూనాలతో చేసుకుంటే 10 నుంచి 15 నిమిషాల్లోనే వైరస్ సోకిందా? లేదా? తెలిసిపోతుంది. టాటా మెడికల్ ఒమిష్యూర్ టెస్ట్ కిట్ ధరను ఒక్కో పరీక్షకు రూ.250గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర టెస్ట్ కిట్ల కంటే చౌకగానే ఉంటుంది.
అయితే, ఇది ఇంట్లో చేసుకునే పరీక్ష కానందున ల్యాబ్ ఫీజు అదనంగా వసూలు చేయనున్నారు. టాటా కంపెనీ ప్రస్తుతం నెలకు రెండు లక్షల కిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా.. వాటిని విదేశాలకు సైతం ఎగుమతిచేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. ఇదిలా ఉండగా.. ఒడిశా స్టేట్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (OSMCL) ఐదు లక్షల ఒమిష్యూర్ కిట్ల కోసం ఆర్డర్ చేసింది. దేశంలోనే కొవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు కిట్లను ఆర్డర్ చేసిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.
ప్రస్తుతం, ఒమిక్రాన్ రోగులు జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత మాత్రమే కనుగొనబడ్డారు. ఒమిష్యూర్ టెస్ట్ కిట్ ఈ దశను తొలగించడంలో సహాయపడుతుంది మరియు ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) పరీక్షల సమయంలో నాసోఫారింజియల్/ఓరోఫారింజియల్ నమూనాలలో SARS-CoV2 యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తిస్తుంది. ఇవాళ్టి నుంచి ఈ ఒమిష్యూర్ కిట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కాగా దీని ధర రూ. 250 ధరలో ఉండే అవకాశం ఉంది. యాంటిజెన్ పరీక్షల ధర రూ. 250-రూ. 500 మధ్య ఉంటుంది.
పరీక్షకు ముందు ఈ సన్నాహాలు చేసుకోవాలి:
* మీరు పరిశుభ్రమైన స్థలాన్ని కనుగొనడం ముఖ్యం.
* టేబుల్ని గుర్తించి, ఉపరితలాన్ని శుభ్రపరచండి.
* మీ చేతులను సబ్బుతో కడుక్కోండి మరియు మీరు పరీక్ష చేసే ముందు అవి పొడిగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
* పర్సును చింపి, కిట్‌లోని వస్తువులను టేబుల్‌పై వేయండి.
* మీరు కొనసాగడానికి ముందు, టెస్టింగ్ కిట్‌లో పేర్కొన్న యాప్‌ను డౌన్లోడ్ చేసి, ఆధారాలను పూరించండి. పాజిటివ్ కేసు మిస్ కాకుండా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం.
టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా OmiSure టెస్ట్ కిట్‌ని ఉపయోగించి ఇంట్లో పరీక్షించడం ఎలా
పరీక్ష సమయం: 85 నిమిషాలు
ఫలితాల సమయం: నమూనా సేకరణ మరియు ఆర్ఎన్ఏ (RNA) వెలికితీతతో సహా 130 నిమిషాలు
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more