Vanama Raghava sent to 14-day judicial custody వనమా రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Trs mla s son accused in businessman s suicide sent to 14 day judicial custody

vanama raghavender, Family suicide, Telangana police, Abetment of suicide, Vanama Venkateswara Rao, Ramakrishna, Family Suicide, Palwancha suicide case, Raghavender video, family suicide case, Palwancha, Khammam, Telangana, crime

TRS MLA Vanama Venkateswara Rao's absconding son, wanted in connection with the suicide of a businessman and three of his family members in Telangana's Bhadradri Kothagudem district, was nabbed by police on Friday. He was produced in court on Saturday and sent to 14 days judicial custody. He has been shifted to Kothagudem sub jail.

వనమా రాఘవేందర్ రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Posted: 01/08/2022 05:00 PM IST
Trs mla s son accused in businessman s suicide sent to 14 day judicial custody

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన వ్యాపారి.. కుటుంబంతో పాటుగా సామూహిక ఆత్యహత్యకు పాల్పడేందుకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు పైశాచిక చర్యలు, ఒత్తిడులు, బెదిరింపులే కారణమని మృతుడు నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన రెండో సెల్పీ ఇవాళ నెట్టింట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన సోదరి రాఘవతో ఏర్పర్చుకున్న అక్రమ సంబంధంతో ఈ విషయం ఆయన వరకు వెళ్లిందని, నిజాలు తెలియకుండానే మద్దతు పలికిన తల్లి తోడు కావడంతోనే తాను ఆప్పులపాలై ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని విధంగా చేశారని ఆరోపించారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న రాఘవ ఓ వాహనంలో ఏపీ వైపు పారిపోతుండగా గతరాత్రి దమ్మపేట మండ‌లం మందలపల్లి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి వనమా రాఘవేందర్ రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో వనమా రాఘవను  అతనిపై పాత కేసులు కూడా తిరగదోడేందుకు కూడా కారణమైంది. ఈ క్రమంలో ఆయనకు చెందిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.

రాఘవ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని తెలిపారు. తన ఆత్మహత్యకు ఆయనే కారణమని ఆరోపించిన రామకృష్ణ.. తన సోదరితో రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందన్నారు. వాటాలు పంచకుండా చివరికి చావు వరకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. ఇక తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దని రామకృష్ణ ఆ వీడియోలో వేడుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh