Palvoncha suicide: Victim’s second video reveals depravity of accused సంచలనం సృష్టిస్తున్న రామకృష్ణ మరో సెల్పీ వీడియో..!

Palvoncha suicide pact naga ramakrishna s second selfie video reveals depravity of accused

vanama raghavender, Family suicide, Telangana police, Abetment of suicide, Vanama Venkateswara Rao, Ramakrishna, Family Suicide, Palwancha suicide case, Raghavender video, family suicide case, Palwancha, Khammam, Telangana, crime

In the Naga Ramakrishna family suicide case, the victim reportedly accused Vanama Raghavendra Rao, son of TRS MLA Vanama Venkateswara Rao, of demanding sexual favours from the family members of the victim in the selfie video that he had shot before taking the extreme step.

ITEMVIDEOS: సంచలనం సృష్టిస్తున్న రామకృష్ణ మరో సెల్పీ వీడియో.. వనమా రాఘవ అరెస్టు

Posted: 01/08/2022 01:55 PM IST
Palvoncha suicide pact naga ramakrishna s second selfie video reveals depravity of accused

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన వ్యాపారి కుటుంబంతో పాటుగా సామూహిక ఆత్యహత్య చేసుకునేందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ పైశాచిక చర్యలు, ఒత్తిడులు, బెదిరింపులే కారణమని మృతుడు నాగ రామకృష్ణ ఆరోపించారు. అయితే ఇందుకు గాను ఆయన ఆత్మహత్యకు పాల్పడేందుకు ముందు తీసుకున్న వీడియో సెల్పీ ఒకటి పెను సంచలనం సృష్టించి.. పోలీసులు అతని అరెస్టు చేసుందుకు.. అతనిపై పాత కేసులు కూడా తిరగదోడేందుకు కూడా కారణమైంది. ఈ క్రమంలో ఆయనకు చెందిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఆత్మహత్యకు ముందు  తీసుకున్న సెల్ఫీ వీడియోల్లో రోజుకొకటి వెలుగులోకి వస్తుండగా, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వనమా రాఘవపై రామకృష్ణ ఈసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రాఘవతోపాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని తెలిపారు. తన ఆత్మహత్యకు ఆయనే కారణమని ఆరోపించిన రామకృష్ణ.. తన సోదరితో రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందన్నారు. వాటాలు పంచకుండా చివరికి చావు వరకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. ఇక తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దని రామకృష్ణ ఆ వీడియోలో వేడుకున్నారు.

ఇక అంతకుముందు బయటకోచ్చిన వీడియోలో.. వనమా రాఘవేంద్రరావు.. మూడు నాలుగు నెలల క్రితం ఇలాంటి ఓ ఘటనలో చిక్కుకుని.. ఆందులో బెయిలు పోందగానే మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం.. సామాన్య ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు అని రామకృష్ణ పేర్కోన్నాడు. ఏ భర్త వినకూడని మాటలను ఆయన నా చెవిన వేశాడు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని.. కానీ తన భార్యను కోరుకోవడం దుర్మార్గమని అరోపించాడు.రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న రాఘవ ఓ వాహనంలో ఏపీ వైపు పారిపోతుండగా గతరాత్రి దమ్మపేట మండ‌లం మందలపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవతో పాటు అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు గురించి పాల్వంచ‌ ఏఎస్పీ రోహిత్ రాజ్ ఈ రోజు మీడియా స‌మావేశం నిర్వ‌హించి అధికారికంగా అన్ని వివ‌రాలు తెలిపారు. రాఘవను విచారణ కోసం పాల్వంచకు తరలించామ‌ని, దాదాపు 10 గంట‌ల పాలు ఆయ‌న‌ను విచారించామ‌ని చెప్పారు. సబ్ డివిజన్ కార్యాలయంలో విచారణ కొన‌సాగించామ‌ని, ఆయ‌న‌పై నమోదైన కేసులు, ఆరోపణలపై ప్ర‌శ్నించామ‌న్నారు.

రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్లు వ‌న‌మా రాఘ‌వ అంగీక‌రించాడ‌ని ఆయ‌న తెలిపారు. కాగా, పాల్వంచ పోలీస్ స్టేష‌న్లో ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు. ఆత్మ‌హ‌త్య లేఖ‌, సెల్ఫీ వీడియోలో రామ‌కృష్ణ వ‌న‌మా రాఘ‌వ‌పై ఆరోప‌ణ‌లు చేశార‌ని ఏఎస్పీ తెలిపారు. ఆత్మ‌హ‌త్య‌కు ఆర్థిక ఇబ్బందులు, ఇత‌ర కార‌ణాలు ఉన్నాయ‌ని రామ‌కృష్ణ చెప్పార‌ని తెలిపారు. త‌న భార్య‌ను కూడా రాఘవ ఆశించాడ‌ని రామ‌కృష్ణ వీడియోలో పేర్కొన్నారని ఆయ‌న వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భ్య‌మైన ఆధారాల‌ను సీజ్ చేసి కోర్టుకు స‌మ‌ర్పించామ‌ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh