AP High Court dismisses GOs 53 and 54 హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ.. ఫీజుల జీవో కొట్టివేత.!

Ap high court dismisses gos on finalising the fees in private schools and colleges

AP High court, YSRCP Govt, CM YS Jagan, Andhra Pradesh High Court, GOs, fees in private schools, fees in Private collages, Andhra Pradesh, Politics

The Andhra Pradesh High Court has quashed previous orders issued by the government on finalisation of fees in schools and colleges. It is a known fact that the state government has done 53, 54 GO in the past by finalizing fees for private unaided schools and junior colleges. East Godavari district private school owners have approached the high court challenging the ordinance.

హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ.. ఫీజుల జీవో కొట్టివేత.!

Posted: 12/27/2021 06:27 PM IST
Ap high court dismisses gos on finalising the fees in private schools and colleges

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం విడుదల చేసిన రెండు జీవోలను న్యాయస్థానం కోట్టివేసింది. ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు కళాశాలల్లో ఫీజులను నిర్ధేశిస్తూ రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జీవోలను జారీ చేసింది. కాగా తాజాగా హైకోర్టు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు నిర్ణయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53, 54జీవోలను ఆగస్టు 24న విడుదల చేసింది.

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్థేశిస్తూ జారీ చేసిన 53, 54 జీవోలను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సోమవారం విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. కాలేజీలలో యాజమాన్యాలు ఏర్పాటు చేసిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరిగణలోకి తీసుకోకుండా, విద్యార్థుల వసతుల కల్పనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరు యాజమాన్యాల నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది.

తూర్పుగోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌’ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు సహా పలు విద్యాసంస్థలు న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేశాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నిర్ణయించి ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి. ఫీజుల నిర్థారించే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని తెలిపాయి. ప్రభుత్వ ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని ప్రైవేటు విద్యాసంస్థలు వాదించాయి. వీరి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రైవేటు ఫీజుల జీవోలను తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles