Delhi court blast: DRDO scientist tries to kill self బాంబు పేలుడుకు కారణమైన డిఆర్డీఓ శాస్త్రవేత్త ఆత్మహత్యయత్నం

Arrested drdo scientist tries to kill himself in police custody

rohini court blast, rohini court blast case, drdo, drdo scientist, rohini court bomb blast, Delhi Police, drdo scientist arrest, Bharat Bhushan Kataria, delhi court explosion, Delhi court blast, delhi latest news, delhi bomb case, Rohini court blast scientist arrest, rohini court explosion, Delhi, Crime

A 47-year-old DRDO scientist, who was arrested by the Delhi Police’s Special Cell on Friday in connection with the recent blast inside the Rohini district court complex, allegedly tried to commit suicide by consuming a toxic substance while in custody. The scientist, Bharat Bhushan Kataria, had allegedly planted the bomb to kill his neighbour, a lawyer, said police.

బాంబు పేలుడుకు కారణమైన డిఆర్డీఓ శాస్త్రవేత్త ఆత్మహత్యయత్నం

Posted: 12/20/2021 11:45 AM IST
Arrested drdo scientist tries to kill himself in police custody

దేశరాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల బాంబు పేలుడు సంభవించిన కేసులో ఢిల్లీ పోలీసులు 47 ఏళ్ల భరత్ భూషణ్ కటారియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన ఆత్మహత్యకు యత్నించడంతో భరత్ భూషణ్ ను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాంతులు, కడుపునోప్పి వస్తున్నట్లు చెప్పడంతో అతడ్ని అసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్సను అందిస్తున్నారు. ఢిల్లీలోని రోహిణి కోర్టులో పేలుడు సంభవించేందుకు బాంబును అమర్చిన కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

కాగా పోలీసులు కస్టడీలో ఉన్న డిఆర్డీఓ శాస్త్రవేత్త భరత్ భూషణ్.. తాను మరణించాలని పూనుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన లిక్విడ్ హ్యాండ్ వాష్ ను తాగినట్టు డాక్టర్లు తెలిపారు. ఆయనకు స్టమక్ వాష్ చేశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని.. ఆయనను అబ్జర్వేషన్ లో పెట్టామని వైద్యులు తెలిపారు. కాగా బాంబు బ్లాస్ట్ కేసులో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరగా, న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అప్పగించింది. కాగా ఆయన ఇవాళ పోలీసుల విచారణకు హాజరుకాగానే విరోచనాలతో బాధపడటంతో పోలీసులు అసుపత్రికి తరలించారు.

డిసెంబ‌ర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబ‌ర్ 102లో త‌క్కువ స్థాయి తీవ్ర‌త‌తో బాంబు విస్పోటనం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెష‌ల్ సెల్ పోలీసులు.. తొలుత కోర్టు రూమ్ లో న్యాయవాదులకు చెందిన ల్యాప్ టాప్ బ్యాటీరీ సమస్య కారణంగా పేలుడు జరిగి వుంటుందని భావించారు. అయితే ఇందులో కుట్రకోణం కూడా వుందని ఆ తరువాత వందల సీసీటీవీ కెమెరాల వీడియోలు పరిశీలించి.. తరువాత కోర్టులోకి వచ్చి వేల వాహనాలను పరిశీలించగా.. డీఆర్డీవో శాస్త్ర‌వేత్తను అనుమాన్సదంగా కనిపించడంతో అరెస్టు చేశారు.

తన ఇంటికి పోరుగునున్న న్యాయవాది అమిత్ వాశిష్ట్ తో ప్రతీరోజు గొవడలను ఎదుర్కోంటున్న ఆయన.. ఆయనను అంతమొందించాలని కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తేలిపారు. తాము గమనించిన సిసిటీవీ ఫూటేజీలో డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ రెండు సార్లు క‌నిపించాడ‌ని పోలీసులు తెలిపారు. అతడ్ని గమనించగా.. ఒక‌సారి పేలుడు ప‌దార్ధాలు ఉన్న బ్యాగుతో కనిపించగా.. రెండ‌వ సారి బ్యాగు లేకుండా క‌నిపించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో లిటిగేష‌న్లో ఉన్న డీఆర్డీవో శాస్త్ర‌వేత్త‌.. లాయ‌ర్ ను చంపాల‌ని ప్లాన్ వేసినట్లు పోలీసుల ముందు అంగీక‌రించారు. నిందితుడిపై స‌దురు లాయ‌ర్ ప‌ది కేసులు న‌మోదు చేశాడ‌ని, అస‌హ‌నానికి గురైన అత‌ను ప్ర‌తీకారంతో పేలుడుకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohini court blast case  drdo  drdo scientist  Bharat Bhushan Kataria  Delhi Police  Delhi  Crime  

Other Articles