Railways to introduce hostesses on premium trains రైళ్ల ప్రయాణికుల అతిధి మర్యాదల కోసం త్వరలో ‘ట్రైన్ హాస్టెస్’లు

Indian railways to soon have hostesses on premium trains to offer flight like service

Indian Railways,Train Hostesses,IRCTC,Shatabdi Express,Gatimaan Express,Tejas Express,Train News,Indian Railways news,Train updates

The Indian Railways is soon set to introduce such ‘train hostesses’ on its premium line of coaches – such as the Vande Bharat Express, the Gatimaan Express, and the Tejas Express. The attendants, however, shall not be serving long-distance trains such as Rajdhani Express or Duronto Express.

రైళ్ల ప్రయాణికుల అతిధి మర్యాదల కోసం త్వరలో ‘ట్రైన్ హాస్టెస్’లు

Posted: 12/11/2021 11:24 AM IST
Indian railways to soon have hostesses on premium trains to offer flight like service

ఇన్నాళ్లు విమానయానం చేసే ప్రయాణికులకు సౌకర్యార్థం వినియోగించబడిన ఎయిర్ హాస్టెస్ ల తరహాలు ఇకపై రైళ్లలోనూ ట్రెయిన్ హాస్టెస్ లు దర్శనమివ్వనున్నారు. ఔనా.. అని సంబరపడిపోకండీ ఈ రకమైన హాస్టెస్ లు అన్ని రైళ్లలో కనిపించరు. దేశంలో నడుస్తున్న కేవలం 25 ప్రీమియం రైళ్లలో మాత్రమే ‘ట్రైన్ హోస్టెస్’లు కనిపించనున్నారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు వారు అతిథి మర్యాదలు చేయనున్నారు. విమానంలో ప్రయాణికులకు స్వాగతం పలికి, మర్యాదలు చేసే ‘ఎయిర్ హోస్టెస్‌’లలానే రైళ్లలోనూ ‘ట్రైన్ హోస్టెస్’లను నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ప్రీయియం రైళ్ల ప్రయాణికులకు స్వాగతం పలకడం, ఫిర్యాదుల స్వీకరణ, ఆహారం అందించడం వంటి విధులు వీరు నిర్వర్తిస్తారు. భవిష్యత్తులో ఈ సౌలభ్యాన్ని మరిన్ని రైళ్లకు విస్తరించంచే యోచనలో రైళ్వేశాఖ ఉంది. అయితే ట్రైన్ హోస్టెస్ లలో మహిళలు, పురుషులు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. త్వరలోనే వీరి నియామకాల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 12 శతాబ్ది, 2 వందే భారత్, ఒక గతిమాన్, ఒక తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో కలిపి మొత్తం 25 ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలోనే ‘ట్రైన్ హోస్టెస్’లను నియమిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  Tejas Express  express trains  train attendant  train hostessess  

Other Articles